Samantha : రాజ్-సమంత ఎఫైర్.. దర్శకుడి భార్య అలా క్లారిటీ ఇచ్చిందా?
Samantha : గత కొద్ది రోజులుగా సమంత రాజ్‌ల రిలేషన్ గురించి నెట్టింట అనేక ప్రచారాలు నడుస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. సమంత గెస్ట్ రోల్‌లో నటించి నిర్మించిన శుభం మూవీ సక్సెస్ సందర్భంగా చిత్ర బృందం, రాజ్‌నిడిమోర్‌తో కలిసి ఉన్న ఫొటోలని సమంత నెట్టింట షేర్ చేసింది. రాజ్ నిడిమోర్ భుజంపై సామ్ తలని వాల్చి శుభం తో అద్భుతమైన ప్రయాణం మదలైంది ` అంటూ ఇన్ స్టాలో షేర్ చేసింది.
Samantha : ఏం జరుగుతుంది..
ఇటువంటి సమయం లో దర్శకుడు రాజ్ నిడిమోరు సతీమణి శ్యామాలి స్పందించారు. ఇన్‌స్టా వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ని షేర్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. `నా గురించి ఆలోచించి, విని మాట్లాడే వారితో పాటు నన్ను కలిసి, నాతో మాట్లాడి, నా గురించి రాసేవారందరికీ ప్రేమ, ఆశీస్సులు పంపుతున్నా అంటూ ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. దీంతో ఈ పోస్ట్ చూసిన వారంతా షాక్‌కు గురవుతున్నారు.

Samantha : రాజ్-సమంత ఎఫైర్.. దర్శకుడి భార్య అలా క్లారిటీ ఇచ్చిందా?
గత కొంత కాలంగా ఇన్‌స్టాలో ఎలాంటి పోస్ట్‌లు షేర్ చేయని శ్యామాలి ఉన్నట్టుండి ఇలా పోస్ట్‌ని షేర్ చేయడం ఏంటని అంతా అవాక్కవుతున్నారు. సైకాలజీ చదువుకున్న శ్యామాలి బాలీవుడ్ దర్శకులు ఓం ప్రకాష్ మిశ్రా, విశాల్ భరద్వాజ్‌ల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. 2015లో దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె వివాహం జరిగింది. వీరిద్దరికి ఓ పాప కూడా ఉంది. వివాహం తరువాత రాజ్ నిడియోరు రూపొందించిన సిరీస్‌లు, సినిమాలకు శ్యామాలి క్యాస్టింగ్‌లో సహాయం అందించింది.