Rajamouli : వామ్మో.. రాజ‌మౌళిలో ఈ టాలెంట్ కూడా ఉందా.. స‌తీమ‌ణితో ప్ర‌భుదేవా పాట‌కి డ్యాన్స్ చింపేశాడు..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Rajamouli : వామ్మో.. రాజ‌మౌళిలో ఈ టాలెంట్ కూడా ఉందా.. స‌తీమ‌ణితో ప్ర‌భుదేవా పాట‌కి డ్యాన్స్ చింపేశాడు..!

Rajamouli : ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్కర్లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క ఓట‌మి కూడా పొంద‌ని రాజ‌మౌళి బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్ సినిమాల‌తో త‌న స్థాయి ద‌శ‌దిశ‌లా వ్యాపించేలా చేశాడు. దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా అంటే హీరోలు రెండు మూడేళ్లు అన్ని ఆశ‌లు వ‌దుల‌కోవ‌ల్సిందే. పూర్తిగా ఆయ‌న సినిమాకే అంకింత కావాలి అని అంటాడు. ప్రభాస్ అయితే ఏకంగా ఐదేళ్ల పాటు డేట్స్ ఇచ్చాడు. ఇక ఎన్టీఆర్, రామ్ చ‌రణ్ వంటి వారు […]

 Authored By ramu | The Telugu News | Updated on :11 April 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Rajamouli : వామ్మో.. రాజ‌మౌళిలో ఈ టాలెంట్ కూడా ఉందా.. స‌తీమ‌ణితో ప్ర‌భుదేవా పాట‌కి డ్యాన్స్ చింపేశాడు..!

Rajamouli : ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్కర్లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క ఓట‌మి కూడా పొంద‌ని రాజ‌మౌళి బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్ సినిమాల‌తో త‌న స్థాయి ద‌శ‌దిశ‌లా వ్యాపించేలా చేశాడు. దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా అంటే హీరోలు రెండు మూడేళ్లు అన్ని ఆశ‌లు వ‌దుల‌కోవ‌ల్సిందే. పూర్తిగా ఆయ‌న సినిమాకే అంకింత కావాలి అని అంటాడు. ప్రభాస్ అయితే ఏకంగా ఐదేళ్ల పాటు డేట్స్ ఇచ్చాడు. ఇక ఎన్టీఆర్, రామ్ చ‌రణ్ వంటి వారు రెండేళ్లు ఆయన సినిమా కోసం ప‌ని చేశారు. అయితే రాజ‌మౌళితో సినిమా చేసిన‌ప్పుడు హిట్ ద‌క్కిన మాత్రం త‌ర్వాత ఫ్లాప్ అవుతుంద‌నే సెంటిమెంట్ ఉంది. చాలా సార్లు ఇది నిరూపితం కూడా అయింది.

Rajamouli : ఈ టాలెంట్ కూడా ఉందా..

రాజ‌మౌళి త‌న వ‌ర్క్ విష‌యంలో చాలా క‌మిట్‌మెంట్‌తో ఉంటాడు. సీన్ పర్ఫెక్ట్‌గా వచ్చే వరకూ టేకుల మీద టేకులు చేయిస్తూనే ఉంటారు. వర్క్ విషయంలో అంత స్ట్రిక్ట్‌గా ఉండే రాజమౌళి పర్సనల్ లైఫ్, బయట చాలా సరదాగా ఉంటారు. తాజాగా రాజమౌళి తన సతీమణి రమా రాజమౌళి తో డాన్స్ రిహార్స‌ల్ చేస్తున్న వీడియో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్రభుదేవా సినిమాలోని ‘అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే’ పాటకి తన భార్య రమాతో క‌లిసి రాజమౌళి రిహార్సల్స్ చేస్తుండ‌గా,ఆ స‌మ‌యంలో వీడియో షూట్ చేశారు. ఇందులో జక్క‌న్న డ్యాన్స్ చూసి అంద‌రు థ్రిల్ అవుతున్నారు. చాలా గ్రేస్ తో, ఈజ్‌తో డ్యాన్స్ చేస్తున్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత టాలెంట్ మీలో ఉంది అంటే మీ సినిమాకి మీరే కొరయోగ్రఫీ చేసేయొచ్చు అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

Rajamouli వామ్మో రాజ‌మౌళిలో ఈ టాలెంట్ కూడా ఉందా స‌తీమ‌ణితో ప్ర‌భుదేవా పాట‌కి డ్యాన్స్ చింపేశాడు

Rajamouli : వామ్మో.. రాజ‌మౌళిలో ఈ టాలెంట్ కూడా ఉందా.. స‌తీమ‌ణితో ప్ర‌భుదేవా పాట‌కి డ్యాన్స్ చింపేశాడు..!

కొంద‌రు నెటిజన్లు ఈ వీడియో చూసి ప్రశంసల వర్షం కురిపించారు.ఈ దర్శక దిగ్గజం ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు తో SSMB 29 చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉంది. భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎప్పుడు లాంచింగ్ అవుతుందో, ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియ‌ని ప‌రిస్థితి. చివ‌ర‌గా గుంటూరు కారం సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన మ‌హేష్ బాబు రాజ‌మౌళి సినిమా త‌ర్వాత సినిమా చేయ‌డానికి చాలా స‌మ‌యం ప‌ట్టేలా ఉంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది