రాజమౌళి ముఖ్య అతిథిగా ‘సోలో బతుకే సోబెటర్’ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

రాజమౌళి ముఖ్య అతిథిగా ‘సోలో బతుకే సోబెటర్’ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ..!

 Authored By govind | The Telugu News | Updated on :21 December 2020,10:02 am

రాజమౌళి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వస్తున్నాడంటే ఆ సినిమా మీద ఎలాంటి అంచనాలు ఏర్పడి ఉంటాయే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆర్ ఆర్ ఆర్ లాంటి భారీ మల్టీ స్టారర్ తెరకెక్కిస్తూ క్షణం తీరిక లేకుండా ఉన్న రాజమౌళి ఇప్పుడు ఒక సినిమా నిర్వహించే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా వస్తున్నారట. మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘సోలో బతుకే సోబెటర్’. లాక్ డౌన్ కారణంగా రిలీజ్ కాకుండా ఆగిపోయిన ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా ఈ నెల 25 న విడుదలకి రెడీ అవుతోంది. థియేటర్లు తెరుచుకున్న తర్వాత బిగ్ స్క్రీన్ పై విడుదలవుతున్న మొదటి తెలుగు చిత్రం కావడం తో ఇండస్ట్రీ వర్గాలలో ఈ సినిమా మీద బాగా ఫోకస్ ఉంది.

Sai Dharam Tej Solo Brathuke So Better gets release date - tollywood

అంతేకాదు సాయి తేజ్ డేర్ కి ఇండస్ట్రీ మొత్తం ప్రశంసలతో ముంచేస్తున్నారు. పెద్ద పెద్ద దర్శక, నిర్మాతలే తమ సినిమాలని రిలీజ్ చేయాలంటే ఆలోచనలో పడి సంక్రాంతి రేస్ నుంచి తప్పుకున్నారు. కాని మెగా హీరో మాత్రం ఇంకా ముందే తన సినిమా ‘సోలో బతుకే సోబెటర్’ ని థియేటర్స్ లోకి తీసుకు రాబోతున్నాడు. కాగా ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సుబ్బు అనే యంగ్ డైరెక్టర్ దర్శకత్వం వహించాడు. ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ ఈ సినిమాలో సాయి తేజ్ కి జంటగా నటించింది. కాగా ఈ సినిమాకి డిసెంబర్ 23 న ప్రీరిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు.

Solo Brathuke So Better Wallpapers - Wallpaper Cave

ఈ గ్రాండ్ ఈవెంట్ కి దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. మెగా ఫ్యామిలీతో రాజమౌళి కి ఉన్న అనుబంధం కారణంగా సాయి తేజ్ అడగగానే ఒప్పుకున్నారట. అంతేకాదు ఇండస్ట్రీ మొత్తం లో సాయి తేజ్ డేర్ చేసి తన సినిమా ని రిలీజ్ చేసి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి ధైర్యాన్ని ఇస్తున్న కారణంగా రాజమౌళి ఎంతో గొప్పగా ఫీలయ్యే ఖచ్చితంగా వస్తానని మాటిచ్చారట. మొత్తానికి రాజమౌళి రాక తో సాయి తేజ్ ‘సోలో బతుకే సోబెటర్’ కి మరింత గ్రాండ్ నెస్ యాడ్ అవుతుందని చెప్పుకుంటున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది