RRR Movie : ఆర్ఆర్‌ఆర్ విడుదలపై రాజమౌళి డెసిషన్ ఇదే… తగ్గేదేలే అంటున్న జక్కన్న..!
RRR Movie : దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు తీవ్రతరం అవుతుండటంతో మరోసారి థియేటర్లు మూతపడుతాయని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమాలు నడిపిస్తే నిర్మాతలతో పాటు థియేటర్ యాజమాన్యాలు కూడా నష్టపోవాల్సి వస్తుంది. ఆ నేపథ్యంలో దర్శకుధీరుడు దర్శకత్వం వహించిన పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ మూవీ సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది. ఈ టైంలో సినిమా విడుదల చేస్తే లాభాలు ఏమో కానీ, పెట్టుబడి కూడా రాదనే భయంతో సినిమాను పోస్టు చేసినట్టు మూవీ యూనిట్ ప్రకటించింది.కరోనా కాలంలో థియేటర్లు మూతబడి ఉండటంతో జనాలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌కు బాగా అలవాటు పడిపోయారు.
అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, ఆహా, డిస్నీహాట్ స్టార్, సోని లివ్ ఇలా చాలా వరకు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ మార్కెట్లో ఉన్నాయి. లాక్ డౌన్ టైంలో కొందరు దర్శక నిర్మాతలు తమ మూవీస్‌ను నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. రానున్న రోజుల్లో మళ్లీ నిర్మాతలు ఓటీటీలనే నమ్ముకోవాల్సిన పరిస్థితి రావొచ్చని ఊహగానాలు వినిపిస్తున్నాయి.తాజాగా రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’మూవీకి అమెజాన్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దేశవ్యాప్తంగా కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండంతో పే-ఫర్-వాచ్ విధానంలో ఆర్ఆర్ఆర్ మూవీని విడుదల చేసేందుకు అంగీకరిస్తే రూ.200 కోట్ల వరకు చెల్లిస్తామని దర్శకనిర్మాతలకు చెప్పినట్టు తెలుస్తోంది.
RRR Movie : ఆర్ఆర్ఆర్ మూవీ మేకర్స్‌కు అమెజాన్ బంపర్ ఆఫర్..
అమెజాన్ తరచుగా రూ. 30 కోట్లకు పైగా పెట్టుబడితో బిగ్-టికెట్ ఎంటర్‌టైనర్‌లను కొనుగోలు చేస్తుంది. అనగా పెద్ద చిత్రాలను కొని పే-ఫర్ వాచ్ రూపంలో ఓటీటీలో విడుదల చేస్తుంది. తారక్- చెర్రీ కలిసి ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే ఈ సినిమాను కూడా అలానే అమెజాన్‌లో విడుదల చేస్తే కనీసం రూ. 200 కోట్ల వరకు ఆదాయం వస్తుందని సమాచారం. అయితే, ఈ ఆఫర్‌ను ఆర్ఆర్ఆర్ దర్శకనిర్మాతలు సున్నితంగా తిరస్కరించారట.. ఎందుకంటే ఈ మూవీ థియేటర్లలో విడుదలైతే రూ.400 కోట్ల వరకు వసూళ్లు వస్తాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.