Rajikanth : ఇది నిజంగా క్రేజీనే.. రజనీకాంత్ ఆ ముగ్గురు హీరోయిన్స్‌కి భర్తగా, కొడుకుగా నటించారా..!
ప్రధానాంశాలు:
Rajikanth : ఇది నిజంగా క్రేజీనే.. రజనీకాంత్ ఆ ముగ్గురు హీరోయిన్స్‌కి భర్తగా, కొడుకుగా నటించారా..!
Rajikanth : తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో సూపర్ స్టార్‌గా ముద్రవేసిన రజినీకాంత్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బస్ కండక్టర్‌గా జీవితం ప్రారంభించిన రజినీ, తన అద్భుతమైన నటనతో అగ్రహీరోగా ఎదిగారు. ఇటీవల ‘జైలర్’ మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన ఆయన, ఇప్పుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కూలీ’ సినిమాలో నటిస్తున్నారు…
Rajikanth : ఇది నిజంగా క్రేజీనే.. రజనీకాంత్ ఆ ముగ్గురు హీరోయిన్స్‌కి భర్తగా, కొడుకుగా నటించారా..!
Rajikanth : ఇది విచిత్రమే..
అయితే రజినీ తన సినీ ప్రయాణంలో ముగ్గురు ప్రముఖ హీరోయిన్లకు ఒకేసారి భర్తగా, కొడుకుగా కూడా నటించారని మీకు తెలుసా? 1975లో కె. బాలచందర్ దర్శకత్వం వహించిన ‘అపూర్వ రాగంగల్’ చిత్రంలో శ్రీవిద్య రజినీకాంత్‌కు జోడీగా నటించారు. ఈ సినిమాలో ఆమె భర్త పాత్రలో రజినీ కనిపించారు. అయితే 1991లో మణిరత్నం తెరకెక్కించిన ‘దళపతి’ చిత్రంలో శ్రీవిద్య రజినీకాంత్ తల్లి పాత్రలో కనిపించారు. ఈ విధంగా ఆమెకు భర్తగా, కొడుకుగా నటించారు రజినీ.
కె. బాలచందర్ రూపొందించిన ‘అవర్గల్’ (1977) అనే చిత్రంలో సుజాత భర్తగా రజినీకాంత్ నటించారు. అనంతరం 2002లో వచ్చిన ‘బాబా’ చిత్రంలో సుజాత రజినీకాంత్ తల్లి పాత్ర పోషించారు. రజినీ నిర్మించిన ఈ చిత్రంలో ఆమె తల్లిగా కనిపించడం విశేషం. ‘నెట్రికన్’ అనే చిత్రంలో రజినీకాంత్ ద్విపాత్రాభినయం చేశారు . అందులో తండ్రి మరియు కొడుకుగా నటించారు. ఈ సినిమాలో లక్ష్మి..తండ్రి రజినీ భార్యగా నటించారు. ఆ తర్వాత 1999లో వచ్చిన ‘నరసింహ’ సినిమాలో లక్ష్మి రజినీకాంత్ తల్లిగా నటించారు. ఈ విధంగా ముగ్గురు సీనియర్ హీరోయిన్లకు ఒకేసారి భర్తగా, కొడుకుగా నటించిన అరుదైన అవకాశం రజినీకి లభించింది. ఇది ఆయన సినీ కెరీర్‌లోని ప్రత్యేక ఘట్టాల్లో ఒకటిగా నిలిచిపోయింది.