Jailer Movie Public Talk : జైలర్ పబ్లిక్ టాక్.. పెట్టిన డబ్బులకు న్యాయం.. నెవ్వర్ బిఫోర్ అనేలా రజినీ

Advertisement

Jailer Movie Public Talk : జైలర్ మూవీ రివ్యూ , సూపర్ స్టార్, తలైవా రజినీ Rajinikanth సినిమా అంటే దేశ విదేశాల్లో హంగామా ఉంటుంది. ఇక కొన్ని దేశాల్లో అయితే ఏకంగా సెలవులు కూడా ప్రకటిస్తుంటారు. మన దేశంలో బెంగళూరు Bengaluru, చెన్నైchennai వంటి నగరాల్లో హాలీ డేలు  ఇస్తారు. ప్రైవేట్ కంపెనీలన్నీ కూడా రజినీ సినిమా విడుదల తేదీని హాలీ డేలు ప్రకటించడం విశేషం. ఇక నేడు థియేటర్లోకి వచ్చిన జైలర్ సినిమా సైతం అందరినీ ఆకట్టుకుంది. టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ క్లిక్ అయ్యాయి. ఇప్పుడు థియేటర్లోనూ అందరినీ మెప్పించింది.

Advertisement

జైలర్ సినిమాకు అన్ని చోట్లా షోలు పడ్డాయి. టాక్ బయటకు వచ్చింది. సినిమా అదిరిపోయిందని అంటున్నారు. సినిమా కోసం మీరు పెట్టే డబ్బులకు వంద శాతం న్యాయం జరుగుతందని అంటున్నారు. ఈ సినిమాకు మీరు ఎన్ని డబ్బులు పెట్టినా అదంతా కూడా ఇంటర్వెల్స్, ప్రీ ఇంటర్వెల్, ప్రో ఇంటర్వెల్ సీన్లకు సరిపోతుంది. అవి సినిమాను ఇంకో లెవెల్‌కు తీసుకెళ్లాయి అని అందరూ అంటున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిందని టాక్ వచ్చేసింది.

Advertisement
Rajinikanth Jailer Movie Review And Public Talk
Rajinikanth Jailer Movie Review And Public Talk

Jailer Movie Public Talk రజినీ వ‌న్ మెన్ షో జైలర్ మూవీ రివ్యూ

జైలర్ సినిమాలో Jailer Movie  రజినీ స్టైల్, స్వాగ్, యాక్టింగ్ ఇలా అన్నీ కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచాయట. ఇక అనిరుధ్ తన నేపథ్య సంగీతంతో ఆడేసుకున్నాడట. థియేటర్లో బాక్సులు బద్దలు అయ్యాయట. రజినినీ అదిరిపోయేలా ఎలివేట్ చేశాడట. ఇక దర్శకుడు నెల్సన్ కామెడీ టైమింగ్, యోగిబాబు రజినీ ట్రాక్ అద్భుతంగా వచ్చిందట. ఫస్ట్ హాఫ్ వీర లెవెల్లో ఉంటే.. సెకండాఫ్ కాస్త తగ్గిందట. కానీ ఓవర్ ఆల్‌గా సినిమా అదిరిపోయిందని అంటున్నారు. ట్విట్టర్‌లో అందరూ కూడా మూడు రేటింగ్స్ ఇస్తూ రజినీ కమ్ బ్యాక్ అదిరిందని అంటున్నారు. ఈ సినిమాతో వీకెండ్ బాక్సాఫీస్ మోతమోగిపోయేలా ఉందని అభిప్రాయపడుతున్నారు.

Advertisement
Advertisement