Rajiv kanakal shares shocking truth about Jr NTR
Jr NTR : 2009 సాధారణ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ యాక్సిడెంట్ గురించి దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది. ఈ ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో తారక్ బయట పడిన సంగతి అందరికీ విదితమే. కాగా, ఈ ప్రమాదం కంటే ముందరే చావు అంచుల వరకు తారక్, రాజీవ్ కనకాల వెళ్లారట. ఈ విషయాలను రాజీవ్ కనకాల ఇటీవల ఓ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారంలో ఉన్నపుడు తారక్‌కు జరిగిన యాక్సిడెంట్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. కానీ, అంతకు ముందరే అనగా 2003 సంవత్సరంలోనే జూనియర్ ఎన్టీఆర్‌కు తప్పిన ప్రమాదం గురించి దాదాపుగా ఎవరికి తెలిసి ఉండదు.
Rajiv kanakal shares shocking truth about Jr NTR
ఆ ఘోర ప్రమాదం గురించి సంచలన నిజాలు చెప్పాడు రాజీవ్ కనకాల. తారక్, తాను కలిసి ‘నాగ’ సినిమా షూటింగ్ లో ట్రైన్‌పై ఓ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్న సందర్భంలో ఘోర ప్రమాదం జరిగిందని గుర్తు చేసుకున్నాడు రాజీవ్ కనకాల. ఆ సమయంలో ట్రైన్ సడెన్‌గా కదిలిందని, దాంతో తాము ఇద్దరం ట్రైన్ పై నుంచి కిందకు పడిపోయామని, ఆ సమయంలో ట్రైన్‌కు ఆనుకుని ఉన్న ఇనుప రాడ్డును పట్టుకున్నామని, అది లేకపోయి ఉంటే తమ సంగతి అంతేనని రాజీవ్ చెప్పాడు. మొత్తంగా అలా చావు అంచుల వరకు వెళ్లి బయటపడ్డామని రాజీవ్ పేర్కొన్నాడు.
Rajiv kanakal shares shocking truth about Jr NTR
అయితే, ఈ ప్రమాదం గురించి అస్సలు ఎవరికీ తెలియదని, అప్పట్లో మీడియా అంతగా యాక్టివ్‌గా లేదని రాజీవ్ కనకాల పేర్కొన్నాడు. ఆ రోజున అనగా 2003లో తాను, తారక్ ఇనుప రాడ్డు కనుక లేకపోయి ఉంటే చనిపోయేవారమని గుర్తు చేసుకున్నాడు తారక్. ఇకపోతే తారక్, రాజీవ్ కనకాల బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. తారక్ ఫస్ట్ ఫిల్మ్ ‘స్టూడెంట్ నెం.1’లో రాజీవ్ కనకాల కీ రోల్ ప్లే చేశాడు. ‘ఆది, నాగ, జనతా గ్యారేజ్’ చిత్రాల్లోనూ రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషించాడు.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.