Jr NTR : 2009కి ముందరే చావు అంచుల వరకు నేనూ, తారక్ వెళ్లాం.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన రాజీవ్ కనకాల..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jr NTR : 2009కి ముందరే చావు అంచుల వరకు నేనూ, తారక్ వెళ్లాం.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన రాజీవ్ కనకాల..!

 Authored By mallesh | The Telugu News | Updated on :5 November 2021,7:15 am

Jr NTR : 2009 సాధారణ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ యాక్సిడెంట్ గురించి దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది. ఈ ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో తారక్ బయట పడిన సంగతి అందరికీ విదితమే. కాగా, ఈ ప్రమాదం కంటే ముందరే చావు అంచుల వరకు తారక్, రాజీవ్ కనకాల వెళ్లారట. ఈ విషయాలను రాజీవ్ కనకాల ఇటీవల ఓ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారంలో ఉన్నపుడు తారక్‌కు జరిగిన యాక్సిడెంట్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. కానీ, అంతకు ముందరే అనగా 2003 సంవత్సరంలోనే జూనియర్ ఎన్టీఆర్‌కు తప్పిన ప్రమాదం గురించి దాదాపుగా ఎవరికి తెలిసి ఉండదు.

Rajiv kanakal shares shocking truth about Jr NTR

Rajiv kanakal shares shocking truth about Jr NTR

ఆ ఘోర ప్రమాదం గురించి సంచలన నిజాలు చెప్పాడు రాజీవ్ కనకాల. తారక్, తాను కలిసి ‘నాగ’ సినిమా షూటింగ్‌ లో ట్రైన్‌పై ఓ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్న సందర్భంలో ఘోర ప్రమాదం జరిగిందని గుర్తు చేసుకున్నాడు రాజీవ్ కనకాల. ఆ సమయంలో ట్రైన్ సడెన్‌గా కదిలిందని, దాంతో తాము ఇద్దరం ట్రైన్ పై నుంచి కిందకు పడిపోయామని, ఆ సమయంలో ట్రైన్‌కు ఆనుకుని ఉన్న ఇనుప రాడ్డును పట్టుకున్నామని, అది లేకపోయి ఉంటే తమ సంగతి అంతేనని రాజీవ్ చెప్పాడు. మొత్తంగా అలా చావు అంచుల వరకు వెళ్లి బయటపడ్డామని రాజీవ్ పేర్కొన్నాడు.

Jr NTR  : ఆ ఇనుప రాడ్డు లేకపోయి ఉంటే మా సంగతి అంతే..

Rajiv kanakal shares shocking truth about Jr NTR

Rajiv kanakal shares shocking truth about Jr NTR

అయితే, ఈ ప్రమాదం గురించి అస్సలు ఎవరికీ తెలియదని, అప్పట్లో మీడియా అంతగా యాక్టివ్‌గా లేదని రాజీవ్ కనకాల పేర్కొన్నాడు. ఆ రోజున అనగా 2003లో తాను, తారక్ ఇనుప రాడ్డు కనుక లేకపోయి ఉంటే చనిపోయేవారమని గుర్తు చేసుకున్నాడు తారక్. ఇకపోతే తారక్, రాజీవ్ కనకాల బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. తారక్ ఫస్ట్ ఫిల్మ్ ‘స్టూడెంట్ నెం.1’లో రాజీవ్ కనకాల కీ రోల్ ప్లే చేశాడు. ‘ఆది, నాగ, జనతా గ్యారేజ్’ చిత్రాల్లోనూ రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషించాడు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది