Rakul Preet Singh : బర్త్ డే నాడు బాయ్ ఫ్రెండ్‌ను పక్కన పెట్టేసింది! క్యారవాన్‌లో వాళ్ళతో రకుల్ ఎంజాయ్
Rakul Preet Singh : తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ ఫుల్ పాపులర్ అయింది రకుల్ ప్రీత్ సింగ్. స్టార్ హీరోయిన్‌గా వరుస సినిమాలు చేస్తూనే అటు సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే తన పుట్టినరోజున ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టి షాకిచ్చింది. ఈ ఏడాదిలో రకుల్ పెళ్లి అవుతుందని చెప్పేసింది. బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ, తాను రిలేషన్ షిప్‌లో ఉన్నట్టు రకుల్ ఓపెన్ అయింది. తన బర్త్ డే సందర్భంగా ఈ ప్రకటన చేయడంతో రకుల్ ఇష్యూ ఇప్పుడు జనాల్లో హాట్ టాపిక్ అయింది.
ఈ ఏడాది నువ్వే నాకు అతి పెద్ద బహుమానం. థాంక్యూ మై లవ్. నా జీవితంలో రంగులు నింపినందుకు చాలా థ్యాంక్స్. నా లవ్‌గా నన్ను ఎంతో సంతోష పెడుతున్నావు. ఇక ఇద్దరం కలిసి మరిన్ని జ్ఞాపకాలను రూపొందించుకుందాం అంటూ రకుల్ జాకీ భగ్నానీతో దిగిన పిక్ రివీల్ చేసింది రకుల్. దీనిపై ఆమె లవర్ జాకీ కూడా రియాక్ట్ అయ్యాడు. నువ్ లేకపోతే.. రోజులు రోజుల్లా గడవవు, నువ్ లేకుండా తిండి కూడా సరిగ్గా తిన్నట్టు అనిపించదు అంటూ రకుల్‌పై తన ప్రేమను బయటపెట్టాడు.
Rakul Preet Singh : బర్త్ డే నాడు బాయ్ ఫ్రెండ్‌ను పక్కన పెట్టేసిన రకుల్
ఇంతవరకు బాగానే ఉన్నా ఏ మాత్రం సమయం దొరికినా స్నేహితులతో ఫుల్లుగా ఎంజాయ్ చేసే అలవాటున్న రకుల్.. క్యాస్టూమ్ డిజైనర్ నీరజ కోనతో సరదాగా ఎంజాయ్ చేసింది. 31వ వసంతంలోకి అడుగు పెడుతున్న ఈ యంగ్ లేడీ తన టీమ్ సభ్యులతో కలిసి క్యారవాన్‌లో కేక్ కట్ చేసి రచ్చ రచ్చ చేసింది. దీంతో లవ్ మ్యాటర్ బయటపెట్టినట్లే పెట్టి అప్పుడే ప్రియుడిని పక్కన బెట్టి వీళ్ళతో ఎంజాయ్ చేస్తుందిగా అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.