Rakul Preet Singh : చెప్పకూడనిది చెప్పేశానే.. రకుల్ ప్రీత్ సింగ్‌ కామెంట్స్ వైరల్

Authored By Cinema Desk | The Telugu News | Published on: March 9, 2021, 3:00 pm

Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్‌ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఓ వైపు ఊపిరి సలపనంత బిజీగా ఉంటూ కూడా తన ఫ్యాన్స్‌ను ఎంటర్టైన్ చేసేందుకు సోషల్ మీడియాలో ఏదో ఒకపోస్ట్ చేస్తూనే ఉంటుంది. నిత్యం ఫ్యాన్స్‌తో ముచ్చట్లు పెడుతూ ఉంటుంది. వ్యాయామం, ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలే కాకుండా అప్పుడప్పుడు సరదాగా కొన్ని ఆటలు కూడా ఆడుతూ ఉంటుంది.

ఎలాంటి ప్రశ్నలు అయినా అడగండి అంటూ అప్పుడప్పుడు నెటిజన్లు సవాళ్లు విసురుతూ ఉంటుంది. ఈ మధ్య సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో వింత ఆటలు ఆడుతున్నారు. ఎలాంటి ఫోటోలు అడిగినా కూడా పంపిస్తామని చాలెంజ్ విసురుతున్నారు. ఇంకొందరు వెరైటీ ఆటలను ఆడుతున్నారు. తాజాగా రకుల్ ప్రీత్ ఓ కొత్త రకంగా ఆటను ఆడింది. గిబ్బరిష్ అంటూ ఏదో భాషలో ఉండే వాటిని గుర్తు పట్టాలి.

rakul preet singh funny game

rakul preet singh funny game

Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్‌ కామెంట్స్ వైరల్

ఏదో ఒక భాషలో కొన్ని ప్రశ్నలను సంధిస్తుంటారు. వాటికి సరైన ఇంగ్లీష్ పదాలను చెప్పాలి. తాజాగా అదే క్రమంలో ఓ ప్రశ్న రకుల్ ప్రీత్‌కు ఎదురైంది. అంతకు ముందు ఆమె అన్నింట్లో ఫెయిల్ అయింది. అయితే ఒకటి మాత్రం కరెక్ట్‌గా చెప్పింది. నువ్ నా గర్ల్ ఫ్రెండ్‌గా ఉంటావా? అని సరైన సమాధానాన్ని రకుల్ చెప్పింది. అయితే మామూలుగా అయితే ఓ అమ్మాయి ఇంకో అమ్మాయిని అలా అడగలేదు.. కానీ ఇప్పుడు రకుల్ అడిగింది. అదే విషయాన్ని రకుల్ చెబుతూ.. ఆన్సర్ చెప్పాను కానీ అలాంటిది నేను అడగలేను.. ఎవ్వరికీ చెప్పలేను అంటూ రకుల్ కామెంట్ చేసింది

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp