Ram Charan : చిన్నోడైన రామ్ చరణ్ చాలా గ్రేట్.. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఆయన్ని చూసి ఎప్పుడు నేర్చుకుంటారో ఏమో..!
Ram Charan : మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఈ ఇద్దరు మెగా హీరోల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అసలు ఏ మాత్రం సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలో ఎంటర్ అయిన మెగాస్టార్ చిరంజీవి ఈరోజు అనేక మందికి తాను ఒక రోల్ మోడల్ గా నిలిచాడనంలో ఎలాంటి సందేహం లేదు.. ఇక అన్న వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ తనకంటూ సపరేట్ క్రేజ్ ఏర్పరుచుకున్నాడు. అయితే చిరంజీవి రాజకీయ ఆరంగ్రేటం చేసి సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తిగా రాజకీయాలకే పరిమితం అవుతానని చెప్పినా అది వర్కౌట్ కాకపోవడంతో తిరిగి మళ్లీ సినిమాలలోకి వచ్చారు.
పవన్ కూడా రెండు పడవల మీద కాలు వేస్తూ ఒకపక్క సినిమాలు మరో పక్క రాజకీయాలు చేస్తున్నాడు. అయితే ఈ అన్నదముళ్లు రీమేక్‌లపైన ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. రీఎంట్రీలో వకీల్ సాబ్, భీమ్లా నాయక్ చిత్రాలని రీమేక్ చేసిన పవన్ ఇప్పుడు మరో చిత్రం రీమేక్‌కి సిద్ధంగా ఉన్నాడు. అలానే చిరు కూడా వరుస రీమేక్స్ చేస్తున్నాడు. చిరు చివరిగా గాడ్ ఫాదర్ రీమేక్ చేయగా, ఒరిజినల్ కంటే గాడ్ ఫాదర్ బావుందనే టాక్ వచ్చినా సరే దానికి తగ్గ కలెక్షన్స్ మాత్రం రాబట్టలేకపోయింది. అన్నయ్య చిరంజీవి చేసిన తప్పిదాన్ని చూసిన పవన్ కళ్యాణ్ ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే క్రేజ్ తగ్గడం ఖాయం.
Ram Charan : గాడి తప్పుతున్నారు..!
నిజానికి కరోనా లాక్ డౌన్ లో తెలుగు ప్రేక్షకులు ఇతర భాషలు సినిమాలకు బాగా ఎక్స్పోజ్ అయిన నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి సినిమా వారి ముందుకు తీసుకు వస్తున్నా వారిని మెప్పించడం కొంత కష్టమే అవుతుంది. ఈ నేపథ్యంలో కొత్తదనం ఉన్న కథలతో అలరించడానికి ప్రయత్నించాల్సి ఉంది. పవన్ చిరు కన్నా చరణ్ చిన్నవాడైన ఎంతో బెటర్ అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. తాను రీమేక్‌లు చేయనని , చేయాల్సి వస్తే ఓటిటి లో రిలీజ్ కాకుండా కేవలం ఒక్క భాషలోనే రిలీజ్ అయితే చేస్తానని అన్నాడు. చరణ్‌కి ఉన్న క్లారిటీ పవన్, చిరు ఎందుకు లేదో అని పలువురు కామెంట్ చేస్తున్నారు.