Ram charan : డాడీతో ప్రతీ మూమెంట్ ఎంజాయ్.. ‘ఆచార్య’ ‘సిద్ద’మవుతున్నాడు!

Authored By Cinema Desk | The Telugu News | Updated on: March 1, 2021, 4:48 pm

Ram charan : మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబోలో ఆచార్య సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. ఇందులో రకరకాల ట్విస్ట్‌ల తరువాత రామ్ చరణ్ ఓ పాత్రను వేసేందుకు సెట్‌లొ అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సిద్ద అనే పాత్రలో చెర్రీ నటించబోతోన్నాడని, సెట్‌లో అడుగుపెట్టిన ఓ స్టిల్‌ను షేర్ చేశారు. అయితే ఇప్పుడు చిరంజీవి, చరణ్ కాంబోలో సీన్స్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అటవీ ప్రాంతంలోనే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది.

Ram charan about Chiarnjeevi on Acharya set

Ram charan about Chiarnjeevi on Acharya set

మారెడుమిల్లి, ఖమ్మం అటవీ ప్రాంతాల సరిహద్దుల్లో ఆచార్య షూటింగ్ జరుగుతోంది. అయితే తాజాగా ఈ మూవీ నుంచి రామ్ చరణ్ ఓ స్టిల్‌ను షేర్ చేశాడు. ఇందులో రామ్ చరణ్ చెప్పిన మాటలు, వదిలిన హింట్లు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఏ కామ్రేడ్ మూమెంట్ అంటూ రామ్ చరణ్ చెప్పిన మాటలు చూస్తుంటే.. ఈ ఇద్దరూ ఇందులో నక్సలైట్ పాత్రలను పోషిస్తోన్నట్టు కనిపిస్తోంది. అంతే కాకుండా రామ్ చరణ్ వదిలిన పోస్టర్లో గన్నులు కూడా ఉన్నాయి.

Ram charan : ‘ఆచార్య’ ‘సిద్ద’మవుతున్నాడు!

ఇక ఇదే పోస్టర్‌ను కొరటాల శివ షేర్ చేస్తూ.. ఆచార్య సిద్దమవుతున్నాడు అనే క్యాప్షన్ పెట్టాడు. ఇక డాడీతో నటిస్తుంటే ప్రతీ మూమెంట్‌ను ఎంజాయ్ చేసినట్టు అనిపిస్తోందని చెర్రీ చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఇలా చడీ చప్పుడు లేకుండా పోస్టర్‌ను రిలీజ్ చేయడంతో అందరూ షాక్ అవుతున్నారు. మహా శివరాత్రికి ఏదైనా సర్ప్రైజ్ ఉందేమో అని ఫ్యాన్స్ సంబరపడిపోతోన్నారు. సమ్మర్ కానుకగా మే 13న ఆచార్య సినిమా విడుదల కాబోతోన్న విషయం తెలిసిందే.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp