Ram Charan : డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడికి రామ్ చరణ్ ఛాన్స్..?
Ram Charan : ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడు..ఇంకా చెప్పాలంటే భారీ డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడికి అంత త్వరగా హీరోలు వెంటనే ఛాన్స్ ఇవ్వరనే విషయం ఇప్పటికే పెద్ద దర్శకుల విషయంలో చాలాసార్లు ప్రూవ్ అయింది. సూపర్ స్టార్ మహేశ్ బాబుకి ఏ దర్శకుడైనా ఫ్లాప్ ఇస్తే మళ్ళీ ఆ దర్శకుడిని
దగ్గరకు కూడా రానివ్వరనే ప్రచారం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఆలోచిస్తే అది నిజమని నమ్మొచ్చు. దీనికి ఉదాహరణ పూరి జగన్నాథ్, సుకుమార్ లాంటి వారే. ఈ ఇద్దరు దర్శకులు మహేశ్‌తో సినిమాలు చేశారు.పూరి జగన్నాథ్..పోకిరి, బిజినెస్ మ్యాన్ లాంటి భారీ హిట్స్ ఇచ్చారు. సుకుమార్ మహేశ్‌తో తీసింది ఒక్క సినిమానే.
కానీ ఆ సినిమా ఫ్లాప్‌గా మిగిలింది. మళ్ళీ మహేశ్‌తో సినిమా చేసి హిట్ ఇవ్వాలనుకుంటే ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఇదే ఇప్పుడు చరణ్ కూడా రిపీట్ చేస్తారా అని మాట్లాడుకుంటున్నారు. మిర్చి
సినిమా నుంచి భరత్ అనే నేను వరకు బ్యాక్ టు బ్యాక్ భారీ కమర్షియల్ హిట్ ఇచ్చారు దర్శకుడు కొరటాల. ప్రభాస్, మహేశ్, ఎన్.టి.ఆర్ లాంటి వారికి సాలీడ్ హిట్ మాత్రమే కాదు నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టారు కొరటాల.అదే ట్రాక్ రికార్డ్ చూసి చరణ్‌తో సినిమా అనుకున్న కొరటాలకు ఏకంగా మెగాస్టార్ ఆఫర్ ఇచ్చారు. ఇందులో చరణ్ కూడా నటించాలని కొరటాల చిరును కోరారు. అనుకున్నట్టుగా ఆచార్య సినిమా తీసే ఛాంద్ అందుకున్న కొరటాల అనూహ్యంగా ఫ్లాప్ ఇచ్చారు.

Ram Charan Chance for director given disaster
Ram Charan : కొరటాలకు ఏకంగా మెగాస్టార్ ఆఫర్ ఇచ్చారు.
ఇది మెగా అభిమానులను తీవ్రంగా నిరాశపరించింది. దీని నుంచి కోలుకోవడానికి కొరటాలకు చాలా సమయం పట్టింది. అయితే, త్వరలో ఎన్.టి.ఆర్ సినిమాను సెట్స్ మీదకు తీసుకురాబోతున్న కొరటాల ఆ తర్వాత చరణ్ హీరోగా మళ్ళీ సినిమా చేయాలని ఉబలాటపడుతున్నారట. మరి శంకర్ లాంటి అగ్ర దర్శకుడితో పాన్ ఇండియన్ సినిమా చేస్తున్న చరణ్ డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడికి ఛాబ్స్ ఇస్తాడా..? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే, గౌతం తిన్ననూరి లాంటి యంగ్ డైరెక్టర్‌కు మెగా పవర్ స్టార్ ఛాన్స్ ఇచ్చారు. కాబట్టి కొరటాలకు చరణ్ అవకాశం ఇవ్వొచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.