Ram Charan : మెగాపవర్ స్టార్ రాంచరణ్ చాలా బిజీగా మారిపోయాడు. రీసెంట్‌గా ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియన్ హిట్ కొట్టిన చరణ్.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఆర్సీ-15 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్‌లో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే 50శాతం సినిమా షూటింగ్ పూర్తయ్యిందట.. కానీ శంకర్ ఒకేసారి ఇండియన్ -2 మూవీ, ఆర్సీ-15 తెరకెక్కిస్తుండటంతో కాస్త గ్యాప్ వచ్చినట్టు తెలుస్తోంది. శంకర్ తెరకెక్కిస్తున్న సినిమాకు సంబంధించి టైటిల్ పై క్లారిటీ రాలేదు. ఈ సినిమాకు భారీ బడ్జెట్ పెట్టినట్టు సమాచారం. దీనికి నిర్మాతగా దిల్‌రాజు వ్యవహరిస్తున్నారు.శంకర్ ప్రస్తుతం కోర్టు కేసుల చుట్టూ తిరుగుతుండటం వలన సినిమా ఆలస్యం కావడంతో నిర్మాణ వ్యయం కూడా పెరుగుతోందని నిర్మాత ఆవేదన వ్యక్తం చేస్తున్నారట..
అటు ఇండియన్-2 మూవీ ఇటు ఆర్సీ-15 సినిమాను రోజుల వ్యవధి తేడాతో శంకర్ డైరెక్ట్ చేస్తున్నారట.. తాజాగా ఆర్సీ -15 కోసం శంకర్ పది రోజుల టైం కేటాయించారట.. ఈ షెడ్యూల్ ఏపీలోని రాజమండ్రిలో వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించారట. రెండ్రోజుల్లో షూటింగ్ ప్రారంభం కానుండగా.. చరణ్ వెంటనే ఇందులో జాయిన్ కావాల్సి ఉంది. ఇక ఇప్పటివరకు వచ్చిన ఔట్ పుట్ పై నిర్మాత సంతృప్తి వ్యక్తం చేశారట..ఇక సంగీతం విషయమై ఎస్ ఎస్ థమేన్ ప్రత్యేకమైన బాణీలు సమకూర్చుతున్నారట..ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వాణి నటిస్తోంది.
శంకర్ కాస్త కోర్టు కేసుల నుంచి భయటపడితే ఈ సినిమా త్వరగా పూర్తవుతుందని వార్తలు వస్తున్నాయి.కాగా, ఈ సినిమాకు ఏ పేరు పెట్టాలనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు.దీనిపై దర్శకుడు వర్క్ చేస్తున్నారట..ఈ సినిమా ఎలాగైనా విజయం సాధించాలని, అందుకు తగ్గ టైటిల్ ఎంపిక చేసే పనిలో ఉన్నారు. కంటెంట్ కూడా చాలా కొత్తగా ఉంటుందని అంటున్నారు. ఒక నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో చరణ్ కనిపించనున్నారట..ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక బ్యూరోక్రాట్ ఎలా గళం విప్పాడు. ఎలా తన జీవితంలో సక్సెస్ అయ్యాడన్నదే స్టోరీ. పాన్ ఇండియా ప్రేక్షకులను ఆదరించేలా టైటిల్‌తో పాటు సన్నివేశాలను కూడా శంకర్ ప్రత్యేకంగా తెరకెక్కిస్తున్నాడట.
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.