Ram Charan : డైరెక్టర్ శంకర్ విషయంలో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ram Charan : డైరెక్టర్ శంకర్ విషయంలో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు !

Ram Charan : మెగాపవర్ స్టార్ రాంచరణ్ చాలా బిజీగా మారిపోయాడు. రీసెంట్‌గా ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియన్ హిట్ కొట్టిన చరణ్.. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో ఆర్సీ-15 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్‌లో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే 50శాతం సినిమా షూటింగ్ పూర్తయ్యిందట.. కానీ శంకర్ ఒకేసారి ఇండియన్ -2 మూవీ, ఆర్సీ-15 తెరకెక్కిస్తుండటంతో కాస్త గ్యాప్ వచ్చినట్టు తెలుస్తోంది. శంకర్ తెరకెక్కిస్తున్న సినిమాకు సంబంధించి టైటిల్ పై […]

 Authored By mallesh | The Telugu News | Updated on :10 October 2022,8:00 pm

Ram Charan : మెగాపవర్ స్టార్ రాంచరణ్ చాలా బిజీగా మారిపోయాడు. రీసెంట్‌గా ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియన్ హిట్ కొట్టిన చరణ్.. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో ఆర్సీ-15 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్‌లో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే 50శాతం సినిమా షూటింగ్ పూర్తయ్యిందట.. కానీ శంకర్ ఒకేసారి ఇండియన్ -2 మూవీ, ఆర్సీ-15 తెరకెక్కిస్తుండటంతో కాస్త గ్యాప్ వచ్చినట్టు తెలుస్తోంది. శంకర్ తెరకెక్కిస్తున్న సినిమాకు సంబంధించి టైటిల్ పై క్లారిటీ రాలేదు. ఈ సినిమాకు భారీ బడ్జెట్ పెట్టినట్టు సమాచారం. దీనికి నిర్మాతగా దిల్‌రాజు వ్యవహరిస్తున్నారు.శంకర్ ప్రస్తుతం కోర్టు కేసుల చుట్టూ తిరుగుతుండటం వలన సినిమా ఆలస్యం కావడంతో నిర్మాణ వ్యయం కూడా పెరుగుతోందని నిర్మాత ఆవేదన వ్యక్తం చేస్తున్నారట..

అటు ఇండియన్-2 మూవీ ఇటు ఆర్సీ-15 సినిమాను రోజుల వ్యవధి తేడాతో శంకర్ డైరెక్ట్ చేస్తున్నారట.. తాజాగా ఆర్సీ -15 కోసం శంకర్ పది రోజుల టైం కేటాయించారట.. ఈ షెడ్యూల్ ఏపీలోని రాజమండ్రిలో వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించారట. రెండ్రోజుల్లో షూటింగ్ ప్రారంభం కానుండగా.. చరణ్ వెంటనే ఇందులో జాయిన్ కావాల్సి ఉంది. ఇక ఇప్పటివరకు వచ్చిన ఔట్ పుట్ పై నిర్మాత సంతృప్తి వ్యక్తం చేశారట..ఇక సంగీతం విషయమై ఎస్ ఎస్ థమేన్ ప్రత్యేకమైన బాణీలు సమకూర్చుతున్నారట..ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వాణి నటిస్తోంది.

Ram Charan fans in about director Shankar

Ram Charan fans in about director Shankar

Ram Charan : టైటిల్ పై ఇంకా నో క్లారిటీ..

శంకర్ కాస్త కోర్టు కేసుల నుంచి భయటపడితే ఈ సినిమా త్వరగా పూర్తవుతుందని వార్తలు వస్తున్నాయి.కాగా, ఈ సినిమాకు ఏ పేరు పెట్టాలనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు.దీనిపై దర్శకుడు వర్క్ చేస్తున్నారట..ఈ సినిమా ఎలాగైనా విజయం సాధించాలని, అందుకు తగ్గ టైటిల్ ఎంపిక చేసే పనిలో ఉన్నారు. కంటెంట్ కూడా చాలా కొత్తగా ఉంటుందని అంటున్నారు. ఒక నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో చరణ్ కనిపించనున్నారట..ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక బ్యూరోక్రాట్ ఎలా గళం విప్పాడు. ఎలా తన జీవితంలో సక్సెస్ అయ్యాడన్నదే స్టోరీ. పాన్ ఇండియా ప్రేక్షకులను ఆదరించేలా టైటిల్‌తో పాటు సన్నివేశాలను కూడా శంకర్ ప్రత్యేకంగా తెరకెక్కిస్తున్నాడట.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది