Ram Charan : హీరో రామ్ చరణ్ కి ఘోర అవమానం ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ram Charan : హీరో రామ్ చరణ్ కి ఘోర అవమానం ?

 Authored By prabhas | The Telugu News | Updated on :19 March 2023,10:00 am

Ram Charan : మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ‘ చిరుత ‘ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ అతి తక్కువ టైంలోనే తండ్రికి తగ్గ కొడుకుగా స్టార్ హీరో అయ్యాడు. ఇక ఇటీవల ‘ ఆర్ఆర్ఆర్ ‘ సినిమాతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందాడు. అయితే రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమా ఏదైనా ఉందంటే అది ‘ ఆరెంజ్ ‘ సినిమానే. మగధీర లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అందుకున్న రాంచరణ్ తర్వాత ఆరెంజ్ సినిమా చేశాడు. ఇది భారీ డిజాస్టర్ గా నిలిచింది. అసలు ఈ సినిమా రామ్ చరణ్ ఎందుకు చేశాడా అని అభిమానులు ఇప్పటికీ ఆవేదన వ్యక్తం చేస్తుంటారు.

Ram Charan feel shame about that movie

Ram Charan feel shame about that movie

ఆరెంజ్ సినిమా గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిదని అభిమానులు భావిస్తుంటారు. అయితే అలాంటి సినిమాని రీ రిలీజ్ చేయడానికి ఫ్లాన్ చేయడం అభిమానులకు ఆందోళన కలిగిస్తుంది. మగధీర సినిమాను రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని భావించారు. అయితే కొన్ని కారణాల వలన ఆ సినిమాకు బదులుగా ఆరెంజ్ సినిమాను విడుదల చేయాలని అభిమానులు ప్లాన్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని అధికారికంగా కూడా ప్రకటించారు. దీంతో కొందరు ఈ సినిమాను రిలీజ్ చేయడం సరికాదని, ఇది రాంచరణ్ అవమానించినట్లు అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Ram Charan strong counter to rk roja

Ram Charan strong counter to rk roja

ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వలన రామ్ చరణ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇకపోతే రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేయాలని సినిమా యూనిట్ ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఇక ఇప్పటినుంచి రామ్ చరణ్ సినిమాలన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతాయని తెలుస్తుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది