Daaku Maharaaj : గేమ్ చేంజర్ టాక్ డాకు మహారాజ్ కి కలిసి వస్తుందా..?
ప్రధానాంశాలు:
Daaku Maharaaj : గేమ్ చేంజర్ టాక్ డాకు మహారాజ్ కి కలిసి వస్తుందా..?
Daaku Maharaaj : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ Ram Charan శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమా గేమ్ చేంజర్ . ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటించగా థమన్ మ్యూజిక్ అందించాడు. సినిమాను దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారని తెలుస్తుండగా కేవలం సాంగ్స్ కోసమే 75 కోట్ల దాకా ఖర్చు పెట్టారని టాక్. సంక్రాంతికి కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన Game Changer సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. కచ్చితంగా చెప్పాలంటే సినిమా శంకర్ ఓల్డ్ స్కూల్ సినిమాలానే ఉందని తెలుస్తుంది. మెగా ఫ్యాన్స్ కొద్దిగా బెటర్ అని చెబుతున్నా మిగతా వాళ్లు మాత్రం సినిమా ఆశించిన స్థాయిలో లేదని చెబుతున్నారు. ఐతే ఈ సినిమా రిజల్ట్ 12న రిలీజ్ కాబోతున్న డాకు మహారాజ్ కి కలిసి వస్తుందని చెప్పొచ్చు.
Daaku Maharaaj : సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో..
గేమ్ చేంజర్, Balakrishna డాకు మహారాజ్ రెండు సినిమాల మధ్య గట్టి పోటీ ఉంది. ఐతే గేమ్ చేంజర్ కి వచ్చిన నెగిటివ్ టాక్ చూస్తుంటే బాలకృష్ణ డాకు మహారాజ్ కి కలిసి వచ్చేలా ఉంది. డాకు మహారాజ్ సినిమా బాబీ డైరెక్షన్ లో తెరకెక్కింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్య దేవర నాగ వంశీ ఈ సినిమా నిర్మించారు. సినిమాకు థమన్ మ్యూజిక్ అందించగా ప్రగ్యా జైశ్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి రౌతెలా హిరోయిన్స్ గా నటించారు.
గేమ్ చేంజర్ హిట్ టాక్ వస్తే డాకు అంతకుమించిన టాక్ తెచ్చుకోవాల్సి ఉండేది. కానీ రామ్ చరణ్ సినిమాకు డివైడ్ టాక్ రావడం అది డాకుకు చాలా ప్లస్ అయ్యేలా ఉంది. ఐతే శనివారం రిలీజ్ అవుతున్న డాకు మహారాజ్ Daaku Maharaaj సినిమా కూడా తేడా కొడితే ఈ రెండిటినీ మించి వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా అదిరిపోతుంది. మరి రాబోతున్న 3 సినిమాల్లో ఒక సినిమా ఫలితం తేలిపోయింది. మరి రాబోతున్న సినిమాల లెక్క ఏంటన్నది చూడాలి. Ram Charan, Game Changer, Balakrishna, Daku Maharaj, Sitara Entertainments