Ram Charan : చరణ్ భారీ కటౌట్.. ఇండియాలోనే అతి పెద్దది.. నెంబర్ 1 అని చెప్పేందుకే..!
ప్రధానాంశాలు:
Ram Charan : చరణ్ భారీ కటౌట్.. ఇండియాలోనే అతి పెద్దది.. నెంబర్ 1 అని చెప్పేందుకే..!
Ram Charan : గ్లోబల్ స్టార్ రాం చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ Game Changer సినిమా 2025 సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. జన్వరి 10న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ను ఈసారి యూఎస్ నుంచి ప్రమోషన్స్ మొదలు పెట్టారు. నేడు డల్లాస్ లో ఈవెంట్ ఉంది. ఐతే ఈమధ్యనే పుష్ప 2 వచ్చి పాన్ ఇండియా లెవెల్ లో భారీ హిట్ అందుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ పై 1500 కోట్ల మార్క్ టచ్ చేసింది. ఐతే చరణ్ గేమ్ ఛేంజర్ ని కూడా రికార్డులను కేరాఫ్ అడ్రెస్ అయ్యేలా చేయాలని మెగా ఫ్యాన్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో అన్ని విషయాల్లో ది బెస్ట్ ఉండేలా చూస్తున్నారు. చరణ్ సినిమా రిలీజ్ అంటే మెగా ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండదు. ఈ క్రమంలోనే ఏపీ, తెలంగాణా రెండు రాష్ట్రాల్లో భారీ కటౌట్ లు ప్లాన్ చేస్తారు. ఈసారి అన్నిటి కన్నా పెద్దగా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనిపించేలా భారీ కటౌట్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రభాస్ కటౌట్ ఒక్కటి అది కూడా 230 అడుగులు రికార్డ్ ఉంది…
Ram Charan బృందావన్ కాలనీ వజ్రా గ్రౌండ్స్ లో..
ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఆ రికార్డ్ మీద కన్నేశారు. 250 అడుగుల కటౌట్ ని ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడ బృందావన్ కాలనీ వజ్రా గ్రౌండ్స్ లో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కౌటౌట్ ఇండియాలోనే అతి పెద్ద కటౌట్ గా రికార్డులోకి ఎక్కుతుంది. ఈ నెల 29న ఈ కటౌట్ ని ఏర్పాటు చేస్తున్నారు. సినిమా రిలీజ్ వరకు ఈ భారీ కటౌట్ అలానే ఉంటుందని తెలుస్తుంది.
ఇక గేమ్ ఛేంజర్ సినిమా విషయానికి వస్తే చరణ్ సరసన కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్, ఎస్ జె సూర్య నటిస్తున్నారు. సినిమా మీద భారీ అంచనాలు ఉండగా మెగా ఫ్యాన్స్ తమ తరపునుంచి సినిమాపై అంచనాలు పెంచేలా ఇలా భారీ కటౌట్ లతో సినిమా రేంజ్ పెంచేస్తున్నారు. గేమ్ ఛేంజర్ పక్కా కమర్షియల్ సినిమా అది కూడా శంకర్ మార్క్ తో వస్తుందని తెలుస్తుంది. Ram Charan, Game Changer, Vijayawada, Shankar, Kiara Advani ,