Ram Charan: ప్రస్తుతం స్టార్స్ అందరు సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తున్నారు. ఇన్ స్టా గ్రామ్.. ట్విటర్.. ఫేస్ బుక్ లాంటి మాధ్యమాలలో యాక్టివ్‌గా ఉంటూ పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలు షేర్ చేస్తున్నారు. మరోవైపు వీటి ద్వారా కొందరు కోట్లు కూడా సంపాదిస్తున్నారు. అయితే సెలబ్రిటీల సోషల్ మీడియాల అధికారిక ఖాతాల మెయింటనెన్స్ కోసం ప్రత్యేకంగా కొన్ని కార్పోరేట్ కంపెనీల టీమ్ లే పనిచేస్తున్నాయి. అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి వారు సోషల్ మీడియాలో దూసుకుపోతుండగా, ఎన్టీఆర్ కూడా కొద్దిగా పర్వాలేదనిపిస్తున్నాడు. తమపై ట్రోలింగ్.. నెగిటివిటీ లాంటివి చోటు చేసుకోకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తపడుతున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ లేనప్పటికీ ఫాలోయింగ్ మాత్రం అసాధారణం. గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఇలాంటి సెటప్ గట్టిగానే ఉండేది. అలాగే సంగీత దర్శకుడు థమన్ కూడా ఒకానొక సందర్భంలో ట్రోలింగ్ కి గురయ్యాడు. దీంతో ఆయన జాగ్రత్తలు తీసుకోవడంతో పాజిటివ్ వైబ్ క్రియేట్ అవుతోంది. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ట్విటర్ ఫాలోయింగ్ పెంచుకునే పనిలో పడ్డారు. `ఆర్ ఆర్ ఆర్` ప్రమోషన్ యాక్టివిటీ స్పీడప్ చేసినప్పటి నుంచి చరణ్ కూడా ట్విటర్ పై దృష్టి పెట్టారు.
బాలీవుడ్ మార్కెట్లో ప్లానింగ్ సహా.. పాన్ ఇండియా కంటెంట్ పైనే దృష్టి పెట్టడంతో సోషల్ మీడియాని కూడా అంతే కీలకంగా భావంచి స్ట్రాంగ్ నెట్ వర్క్ ని బిల్డ్ చేసుకునే పనిలో నిమగ్నమైనట్లు టాక్ వినిపిస్తోంది. గతంలో `జంజీర్` రీమేక్ లో నటించిన చరణ్ పై వీపరితమైన ట్రోలింగ్ జరిగింది. ఇప్పుడా లెక్కలన్నింటినీ సరిచేయడానికి చరణ్ సోషల్ మీడియా వింగ్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో చరణ్ ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన రామ్ చరణ్ శంకర్ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించాలని అనుకుంటున్నాడు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.