Peddi Teaser Review : పెద్ది ఫస్ట్ షాట్.. రామ్ చరణ్ ఊరమాస్ బ్యాటింగ్.. సౌండ్ అదిరిపోయింది..!
ప్రధానాంశాలు:
Peddi Teaser Review : పెద్ది ఫస్ట్ షాట్.. రామ్ చరణ్ ఊరమాస్ బ్యాటింగ్.. సౌండ్ అదిరిపోయింది..!
Peddi Teaser Review : గేమ్ ఛేంజర్ ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్ నుండి వస్తున్న చిత్రం పెద్ది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రాంచరణ్ పుట్టిన రోజు సందర్భంగా టీజర్ ప్లాన్ చేశారు. కానీ కొన్ని సమస్యల వల్ల టీజర్ రిలీజ్ కాలేదు. శ్రీరామనవమికి మాత్రం మిస్ కాకుండా ఫ్యాన్స్ ని ఎక్కువగా వెయిట్ చేయించకుండా ఫస్ట్ షాట్ పేరుతో టీజర్ రిలీజ్ చేశారు.

Peddi Teaser Review : పెద్ది ఫస్ట్ షాట్.. రామ్ చరణ్ ఊరమాస్ బ్యాటింగ్.. సౌండ్ అదిరిపోయింది..!
Peddi Teaser Review అదిరిపోయింది..
గ్లింప్స్ లో రామ్ చరణ్ డైలాగ్స్ బాగున్నాయి. రాంచరణ్ ఉత్తరాంధ్ర యాసలో అద్భుతంగా డైలాగులు చెబుతున్నాడు.’ఒకటే పని చేసేనాకి.. ఒకేనాక బతికేనాకి ఇంతపెద్ద బతుకెందుకు.. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాల.. పుడతామా ఏంటి మళ్ళీ’ అంటూ చరణ్ డైలాగులు చెబుతున్నాడు. చరణ్ కి ఎలివేషన్ ఇస్తున్న ప్రతి షాట్ టీజర్ లో హైలైట్ గా ఉంది. ఇక టీజర్ చివర్లో చరణ్ క్రికెట్ ఆడుతూ సిక్సర్ కొట్టే షాట్ అయితే మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి.
రాంచరణ్ మాస్ గెటప్, బాడీ లాంగ్వేజ్ ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉంది. ఇక ఏఆర్ రెహమాన్ అందించిన బిజియం అయితే టీజర్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళిపోయింది. సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. సీనియర్ నటుడు జగపతిబాబు, కన్నడ స్టార్ శివ రాజ్‌కు మార్, దివ్యేందు లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలతో కలిసి వెంకట సతీశ్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
