Ram Charan : రామ్ చరణ్ ధరించిన ఈ లెదర్ జాకెట్ ధర రెండు లక్షల పైమాటే అంటే నమ్ముతారా..!
Ram Charan:చిరంజీవి తనయుడిగా వెండితెర ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఆనతి కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. రామ్ చరణ్, ఉపాసన పెళ్లి జరిగి 10 ఏళ్లు పూర్తయ్యాయి. తమ పదేళ్ల వివాహ జీవితాన్ని స్వీట్ మెమరీగా మలుచుకునేందుకు ఇటలీలో పెళ్లి రోజు వేడుకలను ఘనంగా చేసుకున్నారు. సెలబ్రేషన్స్ లో వారు వేసుకున్న డ్రెస్ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. పెళ్లి రోజున రామ్ చరణ్, ఉపాసన వేసుకున్న డ్రెస్ ఖరీదు రూ. 2,23,049 అని సమాచారం. ఎయిర్ పోర్ట్ లో డెనిమ్ జాకెట్ వేసుకుని స్టయిలిష్ లుక్ లో అదరగొడుతున్న రామ్ చరణ్ కెమెరా కంటికి చిక్కారు.
ఒక బ్లాక్ బస్టర్, ఒక డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇన్నేళ్ల కెరీర్‌లో రామ్ చరణ్ నటించిన రెండు సినిమాలు ఒకే కాలండర్ ఇయర్‌లో విడుదల కావడం ఇదే మొదటి సారి. కొద్ది నెలల గ్యాప్‌లోనే ఆర్ఆర్ఆర్, ఆచార్య చిత్రాలతో పలకరించాడు రామ్ చరణ్. ఇదో రికార్డుగా చెప్పుకుంటున్నారు మెగాభిమానులు. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో సినిమా అనడంతో సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఈ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నిదిల్ రాజు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.

ram charan red raw lather jacket here are the details
Ram Charan : అంత ఖరీదా..
కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోన్నారు. శంకర్- రామ్ చరణ్ కాంబోలో రూపొందుతున్న సినిమాలో చరణ్ రెండు పాత్రల్లో కనిపిస్తారట. వాటిల్లో ఒకటి విద్యార్థి కాగా, మరొకటి ప్రభుత్వోద్యోగి అని టాక్. ఈ సినిమాకి ఇప్పటివరకూ ‘విశ్వంభర’, ‘సర్కారోడు’ అనే టైటిల్స్ వినిపించాయి. తాజాగా ‘అధికారి’ అనే టైటిల్ తెరపైకి వచ్చింది. చరణ్ ప్రభుత్వ అధికారిగా నటిస్తున్నారు కాబట్టి ఈ టైటిల్ సరిపోతుందనే ఆలోచనలో ఉందట చిత్రబృందం. ఈ టైటిల్‌కి పాన్ ఇండియా అప్పీల్ కూడా ఉంటుందని భావిస్తున్నారట. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్‌కి పూర్తవుతుందని టాక్.