Ram Charan : రామ్ చరణ్ మొదటి వ్యాపారంలో ఎంత నష్టపోయాడో తెలుసా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ram Charan : రామ్ చరణ్ మొదటి వ్యాపారంలో ఎంత నష్టపోయాడో తెలుసా

Ram Charan : రామ్ చరణ్ హీరోగా సూపర్ హిట్ అయ్యాడు.. టాలీవుడ్‌ లో సూపర్‌ స్టార్‌ గా మంచి పేరు సాధించాడు.. నటుడిగా అతడు తండ్రికి తగ్గ తనయుడు.. కానీ ఒక వ్యాపారవేత్త గా మాత్రం ఆయన మొదటి ప్రయత్నంలోనే ఫ్లాప్ అయ్యాడు. 2015 సంవత్సరం లో స్నేహితులతో కలిసి ట్రూజెట్‌ అనే ఒక విమానయాన సంస్థ ను చరణ్‌ ప్రారంభించాడు. డొమెస్టిక్ సర్వీసులను అందించే విధంగా ఆ సంస్థకు సంబంధించిన అనుమతులు అప్పటి ప్రభుత్వం […]

 Authored By prabhas | The Telugu News | Updated on :18 February 2022,11:00 am

Ram Charan : రామ్ చరణ్ హీరోగా సూపర్ హిట్ అయ్యాడు.. టాలీవుడ్‌ లో సూపర్‌ స్టార్‌ గా మంచి పేరు సాధించాడు.. నటుడిగా అతడు తండ్రికి తగ్గ తనయుడు.. కానీ ఒక వ్యాపారవేత్త గా మాత్రం ఆయన మొదటి ప్రయత్నంలోనే ఫ్లాప్ అయ్యాడు. 2015 సంవత్సరం లో స్నేహితులతో కలిసి ట్రూజెట్‌ అనే ఒక విమానయాన సంస్థ ను చరణ్‌ ప్రారంభించాడు. డొమెస్టిక్ సర్వీసులను అందించే విధంగా ఆ సంస్థకు సంబంధించిన అనుమతులు అప్పటి ప్రభుత్వం నుండి దక్కాయి. అప్పటి కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు చేతుల మీదుగా ఆ సంస్థ ప్రారంభమైంది.అప్పట్లో ఈ సంస్థ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అతి తక్కువ సమయంలోనే ట్రూ జెట్ విమానయాన సంస్థ విస్తరణలు మొదలు పెట్టారు.

దాదాపుగా వెయ్యి కోట్ల బడ్జెట్ తో ప్రారంభమైన ఈ విమానయాన సంస్థ కాలక్రమేణా అప్పుల ఊబిలో చిక్కుకుంది. నష్టాల వల్ల ఈ సంస్థ అప్పులు చేయాల్సి వచ్చిందట. ఇతర డొమెస్టిక్ సేవలు అందించే విమానయాన సంస్థలతో పోటీపడడం లో చరణ్‌ ట్రూ జెట్‌ విఫలమైంది. దాంతో కష్టాలు మొదలయ్యాయి. కస్టమర్టకు ఎన్ని ఆఫర్లు పెట్టినా.. ఎంతగా ఆకర్షించే ప్రయత్నం చేసినా కస్టమర్లను మాత్రం ఆకర్షించలేక పోయారు. దాంతో ప్రతి సంవత్సరం నష్టాలను మూటగట్టుకుంటుంది. ఇటీవల ఈ సంస్థ సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.ఈ సమయంలో రామ్ చరణ్ మరియు సంస్థ యొక్క ప్రతినిధులు ముంబైలో మకాం వేసి టాటా గ్రూప్ అధినేతలను కలిసి భాగస్వామ్యం పెట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయిఅందుకోసం రామ్‌ చరణ్ ముంబైలో పలువురిని కావడం జరిగిందట.

ram charan trying to get funds for his truejet airways

ram charan trying to get funds for his truejet airways

కానీ ఫలితం మాత్రం కనిపించ లేదు దాదాపుగా రూ. 150 నుండి రూ. 200 కోట్ల పెట్టుబడి ఈ సంస్థకి అవసరం అంటున్నారు. ఆ పెద్ద మొత్తంలో పెట్టుబడి ని బొంబాయి వ్యాపార వర్గాల నుండి రాబట్టాలని రాంచరణ్ ప్రయత్నించారు. కానీ అది విఫలం అయింది. రామ్ చరణ్ మొదటి వ్యాపారం అవ్వడం వల్ల ట్రూజెట్ విమానయాన సంస్థ ను పూర్తిగా వదిలి పెట్టలేక పోతున్నాడు. ఆయన ఎలాగైనా మళ్లీ దాన్ని నిలబెట్టాలి అని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. తనకున్న ఇమేజ్‌ ని ఉపయోగించుకుని ట్రూజెట్‌ కి మంచి పబ్లిసిటీ తీసుకురావాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి తర్వాత తర్వాత అయినా అది సక్సెస్ అయ్యేనా చూడాలి. చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా వచ్చే సంక్రాంతికి రాబోతుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది