Ram Charan : పదవ వార్షికోత్సవం.. ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్న రామ్ చరణ్ దంపతులు
Ram Charan : చిరంజీవి తనయుడిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయిన రామ్ చరణ్ ఆనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇక త్వరలో మరి కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ చేయనున్నాడు. త్వరలోనే వాటిపై క్లారిటీ రానుంది. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన పెళ్లి రోజు నేడు . ఇది వారి 10వ పెళ్లి రోజు. మ్యారేజ్ డేని సెలబ్రేట్ చేసుకోవటానికి చరణ్ – ఉపాసన ఇటలీకి వెళ్లారు. అక్కడ నుంచి వారు ఫొటోలను షేర్ చేస్తున్నారు. ఆ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా రామ్ చరణ్, ఉపాసన కొణిదెల ఫొటో అందరినీ ఆకట్టుకుంటోంది.
ఇద్దరు కలిసి చాలా క్యూట్‌గా నడుచుకుంటూ వస్తుండగా, క్లిక్ మనిపించారు. ఇందులో రామ్ చరణ్, ఉపాసన లుక్ అదిరిపోయింది. చూడచక్కగా ఉన్న ఈ జంటని చూసి మైమరచిపోతున్నారు. క్యూట్ కపుల్‌పై స్టన్నింగ్ కామెంట్స్ చేస్తున్నాడు. అపోలో హాస్పిటల్స్ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలైన ఉపాసనను రామ్ చరణ్ ప్రేమించారు. ఇరువైపు కుటుంబాలను ఒప్పించి 2012 జూన్ 14న వారు వివాహం చేసుకున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే రామ్ చరణ్… RRR సినిమా తర్వాత పాన్ ఇండియా రేంజ్ హీరోగా మారిపోయారు. ఆయన క్రేజ్ బాలీవుడ్‌కి చేరింది. అదే స్పీడులో ఇప్పుడాయన వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేయటానికే ఆసక్తి చూపుతున్నారు. అదే విధానంలో ప్లానింగ్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు.

ram charan upasana celebrate their 10th anniversary
Ram Charan : యానివర్సరీ స్పెషల్..
ప్రస్తుతం రామ్ చరణ్.. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. RC 15గా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారట. ఫ్లాష్ బ్యాక్‌లో ముఖ్యమంత్రిగా.. మరో మోడ్‌లో ఎన్నికల అధికారిగా కనిపిస్తారు. తెలుగులో అగ్ర నిర్మాతలైన దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. వినయ విధేయ రామ చిత్రంలో రామ్ చరణ్‌తో జోడీ కట్టిన కియారా అద్వానీ మరోసారి ఆయన సరసన జతగా కనిపించనుంది. ఇంకా సునీల్, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలైతే ఉన్నాయి.
