Ram Gopal Varma : ఎవరు ఏం చేసిన రామ్ గోపాల్ వర్మ మారడు అంటున్న ఆయన తల్లి… వీడియో
Ram Gopal Varma : సంచలనాలకి మారు పేరు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఒకప్పుడు ఆయన సినిమాలు తెలుగు సినిమా ఖ్యాతిని ఎంతో పెంచాయి. ఇటీవల రామ్ గోపాల్ వర్మ సినిమాలు ఎప్పుడు వస్తున్నాయో..ఎప్పుడు పోతోన్నాయో ఎవ్వరికీ తెలియదు. కానీ ప్రతీ సినిమా ముందు వర్మ చేసే కాంట్రవర్సీలు మాత్రం మామూలుగా ఉండడం లేదు. ఎన్ని రకాలుగా వర్మ ప్రయత్నించినా.. ఆడియెన్స్ మాత్రం ఆయన సినిమాలను ఏ మాత్రం ఆదరించడం లేదు. జనాలు ఆదరించడం లేదు కదా? అని సినిమాలు తీయడం మాత్రం వర్మ ఆపడం లేదు. తనకు నచ్చినట్టుగా ఏవేవో పిచ్చి చిత్రాలను తీస్తూ వస్తున్నాడు.
ఇటీవల వర్మ డేంజరస్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇండియన్ స్క్రీన్ మీద తొలిసారిగా లెస్బియన్ సినిమాను తీస్తున్నానంటూ వర్మ రచ్చ రచ్చ చేసాడు. నైనా గంగూలి, అప్సరా రాణిలతో కలిసి వర్మ తీసిన ఈ చిత్రంకి సంబంధించిన సినిమా పోస్టర్లు, టీజర్, ట్రైలర్ అంతా కూడా సోషల్ మీడియాలో మంటలు పుట్టించాయి. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా తనదైన శైలిలో చేశాడు. ఏం చేసి ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అయితే ఎవరికి అంతు చిక్కని రామ్ గోపాల్ వర్మ గురించి తాజాగా ఆయన తల్లి సూర్యవతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన వరకు వస్తే తనను తాను మార్చుకోవడానికి రాము ఇష్టపడడు.
తను ఇంటికి రాగానే నేను కనిపించాలి.. లేకపోతే ఆయనకునచ్చదు.. నన్ను చూడగానే తన కళ్ళల్లో ఒక మెరుపుఅయితే కనిపిస్తుంది. తనకు మారాలని మనసులో ఉంటేనే మారుతాడు. లేకపోతే ఎవ్వరు చెప్పినా కూడా మారడు. రాము ఈ జన్మలో మారలే లేదు అంటూ ఆమె తెలిపింది. రాము ఎలాంటి వాడో నాకు తెలుసు కాబట్టి తన విషయంలో నా ఆలోచన కూడా ఒకలా ఉంటుంది.. తను ఎవరో నాకు తెలియకపోతే అప్పుడు నా ఆలోచనలు కూడా ఇంకోలా ఉండేవి అని చెబుతూ సూర్యవతి ఎమోషనల్ అయింది.‘వర్మ గురించి చాలా మంది ఎన్నో కామెంట్స్ చేస్తారు కాని రాము ఎలాంటి వాడో నాకు తెలుసు అంటూ ఆయన తల్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
