Ram Gopal Varma : సినిమా ఇండ‌స్ట్రీపై ప్రేమ కాదు.. బుద్ది వ‌చ్చింది అంటూ వ‌ర్మ స్ట‌న్నింగ్ కామెంట్స్ | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Ram Gopal Varma : సినిమా ఇండ‌స్ట్రీపై ప్రేమ కాదు.. బుద్ది వ‌చ్చింది అంటూ వ‌ర్మ స్ట‌న్నింగ్ కామెంట్స్

Ram Gopal Varma : సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలుఅక్క‌ర్లేదు. ఆయ‌న ఏం మాట్లాడిన‌, ఏం చేసిన కూడా హాట్ టాపిక్ అవుతుంది. అయితే వ‌ర్మ తెలుగు సినిమా స్థాయిని పెంచిన ద‌ర్శ‌కుడు.కాని ఇప్పుడు మాత్రం ఆయ‌న ఏ సినిమా చేసిన అది అట్ట‌ర్‌ఫ్లాప్ అవుతుంది. కాంట్ర‌వ‌ర్షియ‌ల్ కామెంట్స్, వివాదాస్ప‌ద ప‌నుల‌తో ఎప్పుడు వార్త‌ల‌లో నిలుస్తున్నాడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. అయితే గొప్ప టెక్నీషియ‌న్‌గా పేరు తెచ్చుకున్న వ‌ర్మ ఇటీవ‌లి కాలంలో […]

 Authored By ramu | The Telugu News | Updated on :7 April 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Ram Gopal Varma : సినిమా ఇండ‌స్ట్రీపై ప్రేమ కాదు.. బుద్ది వ‌చ్చింది అంటూ వ‌ర్మ స్ట‌న్నింగ్ కామెంట్స్

Ram Gopal Varma : సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలుఅక్క‌ర్లేదు. ఆయ‌న ఏం మాట్లాడిన‌, ఏం చేసిన కూడా హాట్ టాపిక్ అవుతుంది. అయితే వ‌ర్మ తెలుగు సినిమా స్థాయిని పెంచిన ద‌ర్శ‌కుడు.కాని ఇప్పుడు మాత్రం ఆయ‌న ఏ సినిమా చేసిన అది అట్ట‌ర్‌ఫ్లాప్ అవుతుంది. కాంట్ర‌వ‌ర్షియ‌ల్ కామెంట్స్, వివాదాస్ప‌ద ప‌నుల‌తో ఎప్పుడు వార్త‌ల‌లో నిలుస్తున్నాడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. అయితే గొప్ప టెక్నీషియ‌న్‌గా పేరు తెచ్చుకున్న వ‌ర్మ ఇటీవ‌లి కాలంలో ఆ పేరుని చెడ‌గొట్టుకోవ‌డం మ‌నం చూశాం. అయితే ఇప్పుడు ఆయ‌న రూట్ మార్చారు. ‘యువర్ ఫిల్మ్స‌ పేరుతో ఓ కొత్త కాన్సెప్ట్‌ను ఆయన లాంచ్ చేశారు. మెజారిటీ సభ్యులు ముఖ్యమంత్రిని ఎంచుకున్నట్లు తమకు నచ్చే సినిమాను ఆడియన్స్‌ లైక్స్‌ ఆదారంగా డెమోక్రటిక్‌ విధానంలో చేయబోతున్నారు రామ్ గోపాల్ వ‌ర్మ‌.

Ram Gopal Varma కొత్త వ‌ర్మని చూడ‌బోతున్నామా..

రీసెంట్‌గా విలేక‌ర్ల‌తో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఏ సపోర్ట్‌ లేని ప్రతిభావంతులను ఎంకరేజ్‌ చేయాలన్నదే మా ఆలోచన. సినిమాకు సంబందించిన అన్నీ విభాగాల్లోనూ ది బెస్ట్‌ టాలెంట్‌ ఆడియన్స్‌ ద్వారానే గుర్తించి, వారితోనే సినిమాలు తీస్తాం. క్రౌడ్ ఫండెడ్ ఆలోచ‌న కూడా నాకు ఉంది అని చెప్పుకొచ్చారు వ‌ర్మ‌. స్టార్‌ హీరోల ఇమేజ్‌ తగ్గ సినిమాలు చేయలేను. గతంలో కూడా ఈ విషయం చెప్పాను. నాకు ఆ కెపాసిటీ లేదు. నేను ఎప్పుడు రియలిస్టిక్‌, డార్క్‌ జానర్‌ సినిమాలు చేశాను. జోనర్‌ బెస్ట్‌ సినిమాలనే చేశాను అని వ‌ర్మ చెప్పుకొచ్చారు.

Ram Gopal Varma సినిమా ఇండ‌స్ట్రీపై ప్రేమ కాదు బుద్ది వ‌చ్చింది అంటూ వ‌ర్మ స్ట‌న్నింగ్ కామెంట్స్

Ram Gopal Varma : సినిమా ఇండ‌స్ట్రీపై ప్రేమ కాదు.. బుద్ది వ‌చ్చింది అంటూ వ‌ర్మ స్ట‌న్నింగ్ కామెంట్స్

అయితే ఓ విలేక‌రి సినిమా ఇండ‌స్ట్రీ మీద ఎందుకు సడెన్‌గా ప్రేమ వచ్చింది అని అడ‌గ‌గా, అందుకు వ‌ర్మ స్పందిస్తూ.. ప్రేమ కాదు బుద్ది వ‌చ్చింది అని చెబుతాడు. వ‌ర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా రీల్స్ చేస్తూ పాపుల‌ర్ అవుతున్న కొందరు ముద్దుగుమ్మలను తన అడల్డ్ ఫిల్మ్స్ కోసం సెలక్ట్ చేసుకొని వారిని స్టార్లుగా మార్చుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.. ఈ విషయంపై ఆర్జీవీ స్పందించారు. అది కామ‌న్‌గా జ‌రుగుతున్న విష‌య‌మే క‌దా అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అయితే వ‌ర్మ రానున్న రోజుల‌లో ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టిస్తారో చూడాలి

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది