Pawan Kalyan : పవన్ కళ్యాణ్ వారాహికి గాలి తీసేసిన రామ్ గోపాల్ వర్మ..!
Pawan Kalyan : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది పవన్ కళ్యాణ్ వారాహి గురించే. అవును.. నిన్న తెలంగాణలో వారాహి వాహనానికి జనసేనాని కొండగట్టులో పూజలు నిర్వహించిన విషయం తెలిసిందే. శ్రీ ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో పూజలు నిర్వహించిన అనంతరం వారాహి ఎక్కి తొలిసారి పవన్ కళ్యాణ్ అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. ఆ తర్వాత ధర్మపురి వెళ్లి అక్కడ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలో వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం నేరుగా విజయవాడకు బయలుదేరారు. ఇవాళ ఉదయం విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో పవన్ కళ్యాణ్.. వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈనేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దీనిపై స్పందించారు. వారాహి వాహనంపై కూడా పలు సెటైర్లు వేశారు. ఏపీ వ్యాప్తంగా ప్రచారం నిర్వహించడం కోసం ఉపయోగించే వారాహి వాహనాన్ని హిట్లర్ వాహనంగా వర్మ అభివర్ణించారు. అంతే కాదు.. పవన్ కళ్యాణ్ కాషాయ వస్త్రాలు ధరించి ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం, వారాహికి పూజలు చేయడం చూసి.. పవన్ ను స్వామి వివేకానందతో పోల్చారు. హిట్లర్ వాహనంపై స్వామి వివేకానందుడు అంటూ పవన్ కళ్యాణ్ పై ఆర్జీవీ సెటైర్లు వేశారు. ఆయన్ను హిట్లర్ వాహనంపై స్వామి వివేకానందుడు అంటూ అభివర్ణించారు.
Pawan Kalyan : హిట్లర్ వాహనంపై స్వామి వివేకానందుడు
ఈ సందర్భంగా ఆర్జీవీ పలు ట్వీట్లు చేశారు. అలాగే.. వారాహి వాహనాన్ని వరాహం అంటూ చెప్పుకొచ్చారు. వరాహం అంటే పంది వాహనం అంటూ చెప్పిన ఆర్జీవీ.. హిట్లర్, స్వామి వివేకానంద అంటే కుడి, ఎడమ పాదాలను నొక్కుతారు.. పవర్ స్టార్ అంటే కూడా అంతే.. అంటూ పవన్ కళ్యాణ్ చురకలు వేశారు. అలాగే.. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ చైతన్య రథాన్ని తీసుకొచ్చిన విషయాన్ని ఆర్జీవీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే.. మిమ్మల్ని విమర్శించే వారిని మాత్రం బస్సు టైర్ల కింద తొక్కించేయండి. లేదంటే కనీసం వాళ్ల మీద కేసులు అయినా పెట్టించండి అంటూ ఆర్జీవీ పవన్ కు సూచించారు. ఇది ఒక అభిమానిగా తన విన్నపం అంటూ చెప్పుకొచ్చారు.