Ramya Krishnan : ఒకే హీరో కి పెళ్ళాం , చెల్లి , కూతురుగా రమ్యకృష్ణ .. తెలుగు సినిమా చరిత్ర లో ఇదొక వింత !
Ramya Krishnan : సౌత్ సినీ పరిశ్రమలో దాదాపు 35 ఏళ్లకు పైగా తన నటనతో మెప్పిస్తూ వస్తున్న కథనాయకి రమ్యకృష్ణ. 1985లో భలే మిత్రులు సినిమాతో తెరంగేట్రం చేసిన అమ్మడు కెరియర్ మొదట్లో వరుస ఫ్లాపులు అందుకుంది. ఆ టైం లోనే ఆమెకు ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా పడ్డది. అయితే రాఘవేంద్ర రావు అల్లుడు గారు సినిమాతో మొదటి సూపర్ హిట్ అందుకుంది రమ్యకృష్ణ. అప్పటినుంచి రమ్యకృష్ణ కెరియర్ ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.
దాదాపు నాలుగు దశాబ్ధాల సినీ చరిత్ర కలిగిన రమ్యకృష్ణ ఒక నటుడితో మాత్రం చెల్లిగా.. కూతురుగా.. భార్యగా మూడు డిఫరెంట్ పాత్రల్లో నటించింది. అదేంటి చెల్లిగా.. కూఒతురుగా నటించిన టైం లో భార్యగా ఎలా చేస్తారు అది కరెక్ట్ కాదు కదా అని అనుకోవచ్చు. చెప్పుకున్నాం కదా నాలుగు దశాబ్ధాల సినీ కెరియర్ లో రమ్యకృష్ణ ఒకే నటుడితో ఇలాంటి పాత్రలు చేయాల్సి వచ్చింది. టైం గ్యాప్ వల్ల ప్రేక్షకులు కూడా దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇంతకీ ఆ నటుడు ఎవరు.. ఆ సినిమాలు ఏంటి అన్నది ఒకసారి చూస్తే.. ఆ నటుడు నాజర్ అని తెలుస్తుంది. నాజర్ తో నరసింహా సినిమాలో రమ్యకృష్ణ చెల్లెలు పాత్రలో నటించింది.
ఇక బాహుబలి సినిమాలో బిజ్జల దేవగా నాజర్ చేస్తే ఆయన భార్య శివగామిగా నటించింది. ఇక అంతకుముందు వచ్చిన వంత రాజవతాన్ వరువేన్ అనే తమిళ సినిమాలో నాజర్ తండ్రి పాత్ర చేస్తే రమ్యకృష్ణ కూతురు రోల్ చేసింది. అత్తారింటికి దరేది సినిమా రీమేక్ గా వచ్చిన ఈ సినిమాలో రమ్యకృష్ణ నదియా రోల్ ప్లే చేయగా బొమ్మన్ ఇరాని పాత్రలో నాజర్ నటించారు. అలా ఒకే నటుడు నాజర్ తో రమ్యకృష్ణ తన కెరియర్ లో ఇలా మూడు రకాల పాత్రలను చేసి మెప్పించింది. సినిమాలే కాదు ఈమధ్య వెబ్ సెరీస్ లతో కూడా అలరిస్తున్న రమ్యకృష్ణ ది ఫైనెస్ట్ యాక్ట్రెస్ ఇన్ ఇండియా అని చెప్పడంలో సందేహం లేదు.