Ramya Krishnan : ఎగసిపడుతున్న రమ్యకృష్ణ అందాలు.. వామ్మో ఇది మామూలు అరాచకం కాదుగా
Ramya Krishnan : సీనియర్ నటి రమ్యకృష్ణ ఇప్పుడు నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. రమ్యకృష్ణ అందాలకు ఒకప్పటి ప్రేక్షకుల పడి చచ్చే వారు. ఇక ఈ తరానికి మాత్రం ఆమె శివగామిగానే తెలుసు. బాహుబలి సినిమాలో ప్రభాస్ తల్లిగా శివగామి పాత్రలో ఆమె అందరినీ ముగ్దుల్ని చేసేసింది. ఆ పాత్రతో రమ్యకృష్ణ క్రేజ్ ఒక్కసారిగా రెట్టింపు అయింది. సెకండ్ ఇన్నింగ్స్ ఓ రేంజ్‌లో దూసుకుపోయింది. అయితే మళ్లీ ఆమెకు శివగామి రేంజ్‌లో కారెక్టర్స్ పడలేదు.అంతగా క్రేజ్ రాలేదు. రొటీన్ రొడ్డ కొట్టుడు పాత్రల్లో నటించింది. అయితేబుల్లితెరపైనా ఆమె ప్రయోగాలు చేసింది.
నాగ భైరవి అనే సీరియల్‌ను భారీ ఎత్తున నిర్మించారు. అందులో గ్రాఫిక్స్, విజువల్స్ ఓ లెవెల్లో పెట్టారు. అందులో రమ్యకృష్ణ మెయిన్ లీడ్ పాత్రను పోషించింది. కానీ ఆ సీరియల్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. కోలీవుడ్‌లో డ్యాన్స్ షోకు జడ్జ్‌గా ఉంటోంది. బీబీ జోడిగల్ అనే షోకు జడ్జ్‌గా రమ్యకృష్ణ వ్యవహరిస్తుంటుంది. ఆ షోలో అనేక వివాదాలు రేగుతుంటాయి. వనిత విజయ్ కుమార్ ఆ షో నుంచి బయటకు వస్తూ.. రమ్యకృష్ణ మీద పరోక్షంగా కౌంటర్లు వేసింది.
ఇక ఈ షోకోసం రమ్యకృష్ణ ధరించే దుస్తులు కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఆమె ఈ వయసులోనూ అందాల ప్రదర్శన చేస్తుంటుంది. తాజాగా ఆమె అందాల ప్రదర్శన పీక్స్‌కు చేరుకుంది. ఎద అందాలు ఎగిసిపడుతున్నట్టుగా చీరకట్టులో కనిపించింది. ప్రస్తుతం రమ్యకృష్ణ ఈ చీరలో చేసిన ఫోటో షూట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. చివరగా ఈమె లైగర్ సినిమాలో కనిపించింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.