Rana Daggubati : మంచు విష్ణు బెదిరించాడు.. గుట్టు విప్పిన రానా
Rana Daggubati : మంచు విష్ణు ప్రస్తుతం మోసగాళ్లు సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. మార్చి 19న రాబోతోన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరిగింది. ఈవేడుకలో ఎన్నో చిత్రవిచిత్రాలు జరిగాయి. మోహన్ బాబు మాట్లాడిన మాటలు, మధ్యలో కరెంట్ పోవడం, గెస్ట్‌లను స్టేజ్ మీదకు పిలవడం, మళ్లీ కిందకు పంపించడం, మధ్యలో ప్రసంగాలు ఇలా రకరకాలుగా ఈవెంట్ జరిగింది. ముఖ్య అతిథి అయిన రానా కార్యక్రమం చివర్లో వచ్చాడు.
చివర్లో మోహన్ బాబు మాట్లాడే సమయంలోనే రానా ఎంట్రీ ఇచ్చాడు. పట్టు పంచ కట్టుకుని తెలుగుదనం ఉట్టిపడేలా రానా ఎంట్రీ ఇచ్చాడు. రమ్మన్నది ఎప్పుడు వచ్చింది ఎప్పుడు? ఏడు గంటలకు వస్తానని చెప్పి తొమ్మిది గంటలకు వస్తావా? అంటూ మోహన్ బాబు స్టేజ్ మీదే రానాను నిలదీశాడు. నేను కూడా నీ సినిమాకు ఇలానే వస్తాను నీతో మాట్లాడను అంటూ రానాకు వార్నింగ్ ఇచ్చేశాడు మోహన్ బాబు. అయితే రానా మాట్లాడుతూ చెప్పిన మాటలు మరింతగా వైరల్ అయ్యాయి.

Rana Daggubati about Manchu vishnu In mosagallu
Rana Daggubati : మంచు విష్ణు బెదిరించాడు.. గుట్టు విప్పిన రానా
మోసగాళ్లు ఈవెంట్‌కు రావడానికి ముఖ్య కారణం మంచు విష్ణు. విష్ణు ఫోన్ చేసి ఏదో బెదిరించినట్టుగా ఈవెంట్‌కు రా అని ఫోన్ పెట్టేశాడు. అలా ఈవెంట్‌కు రావడం జరిగిందంటూ రానా అసలు సంగతి చెప్పేశాడు. ఇక ఇదే విషయంలో విష్ణు మాట్లాడుతూ.. తప్పని పరిస్థితిలో అలా బ్లాక్ మెయిల్ చేయాల్సి వచ్చిందంటూ చెప్పుకొచ్చాడు. మొత్తానికి మోసగాళ్లు సినిమాను గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ చేసేందుకు మంచు విష్ణు ప్రయత్నిస్తున్నాడు.