Rana Daggubati : రామ్ చరణ్ కే రావాల్సిన ఈ నేషనల్ అవార్డు అల్లు అర్జున్ కి ఇచ్చారు.. రానా దగ్గుబాటి సంచలన వ్యాఖ్యలు
Rana Daggubati : ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలోనే కాదు దేశమంతా ఒకటే చర్చ నడుస్తుంది. అదే నేషనల్ అవార్డు అల్లు అర్జున్ కి రావడం. ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రలోనే నేషనల్ ఫిలిం అవార్డు ఒక తెలుగు హీరోకు రాలేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి వాళ్లకే నేషనల్ అవార్డు రాలేదు. కానీ.. తాజాగా పుష్ప సినిమాలో నటనకు గాను ఆ అవార్డును అల్లు అర్జున్ కు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో ఈ అవార్డు గురించి చర్చ, రచ్చ మొదలైంది. అసలు అల్లు అర్జున్ కి ఎలా ఇస్తారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కి కాకుండా ఎలా అల్లు అర్జున్ కి ఇస్తారు. బాహుబలిలో నటించిన ప్రభాస్ కు కూడా రాలేదు.
తాజాగా అల్లు అర్జున్ కు ఈ అవార్డు రావడంపై రానా దగ్గుబాటి స్పందించారు. జై భీమ్ సినిమా చాలా బెస్ట్ మూవీ. కానీ.. ఆ సినిమాకు పుష్ప సినిమాకు మనం కంపేర్ చేయలేం. అలాగే.. నంది అవార్డుల కోసం సెలెక్ట్ చేసే జ్యూరీ వేరే ఉంటుంది. కేంద్రం ఇచ్చే నేషనల్ అవార్డ్స్ సెలెక్షన్ కి వేరే మెట్రిక్స్ ఫాలో అవుతారు. సైమా అవార్డులకు వేరే మెట్రిక్స్ ఫాలో అవుతారు అంటూ చెప్పుకొచ్చారు రానా.అయితే.. మరో జర్నలిస్టు మీ తోటి హీరోనే కదా. ఆయనకు అవార్డు వస్తే వేరే హీరోలు ఎందుకు అసూయగా ఫీల్ అవుతున్నారు అంటూ అడగడంతో జైమ్ బెస్ట్ మూవీ. అది నేను ఒప్పుకుంటాను అంటూ చెప్పుకొచ్చాడు రానా. అయితే.. ఇక్కడ జైభీమ్ సినిమాకు, అల్లు అర్జున్ కు ఎలా కంపేర్ చేస్తాం.
Rana Daggubati : మీ తోటి హీరోకు అవార్డు వస్తే ఎందుకు మీకు నొప్పి
అక్కడ అవార్డు వచ్చింది నటనకు కానీ.. పుష్ప సినిమాకు కాదు కదా అని అడగడంతో అవును.. ఇక్కడ ఒక హీరోను ఇంకో హీరోను కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. ఒక చోట ఒకరికి అవార్డు వస్తుంది. ఇంకోచోట ఇంకొకరికి వస్తుంది. ఎవరి అభిప్రాయం వారిది. ఒక జ్యూరీకి ఒక సినిమా నచ్చే చాన్స్ ఉంది. మరో జ్యూరీకి మరో సినిమా నచ్చుతుంది. జైభీమ్ సినిమా కథ బాగుంది కాబట్టి దానికి ఎందుకు రాలేదు అనేది అక్కడ ప్రశ్న కానీ.. వేరే ఆయనకు ఎందుకు వచ్చింది అనేది కాదు.. అంటూ రానా చెప్పుకొచ్చారు.