Rashmika Mandanna : చీరలో రష్మికా మందన్న.. రణబీర్ చూపంతా అక్కడే.. వీడియో ?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rashmika Mandanna : చీరలో రష్మికా మందన్న.. రణబీర్ చూపంతా అక్కడే.. వీడియో ??

Rashmika Mandanna : బాలీవుడ్ స్టార్ రన్ బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మికా మందన్న కాంబినేషన్లో ‘ యానిమల్ ‘ సినిమా తెరకెక్కింది. తెలుగులో అర్జున్ రెడ్డి, హిందీలో కబీర్ సింగ్ సినిమాలతో ఇండస్ట్రీని షేక్ చేసిన సందీప్ వంగ ఈ సినిమాను దర్శకత్వం వహించారు. అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను టి సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ నిర్మించారు. ఇక ఈ సినిమా డిసెంబర్ 1న విడుదల […]

 Authored By anusha | The Telugu News | Updated on :24 November 2023,11:00 am

ప్రధానాంశాలు:

  •  Rashmika Mandanna : చీరలో రష్మికా మందన్న..

  •  రణబీర్ చూపంతా అక్కడే..??

Rashmika Mandanna : బాలీవుడ్ స్టార్ రన్ బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మికా మందన్న కాంబినేషన్లో ‘ యానిమల్ ‘ సినిమా తెరకెక్కింది. తెలుగులో అర్జున్ రెడ్డి, హిందీలో కబీర్ సింగ్ సినిమాలతో ఇండస్ట్రీని షేక్ చేసిన సందీప్ వంగ ఈ సినిమాను దర్శకత్వం వహించారు. అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను టి సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ నిర్మించారు. ఇక ఈ సినిమా డిసెంబర్ 1న విడుదల కానుంది. దీంతో సినిమా టీం ప్రమోషన్స్ జోరుగా కొనసాగిస్తుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ట్రైలర్ ను నవంబర్ 23న విడుదల చేశారు.

ఈ ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుంది. అయితే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రష్మిక మందన , రన్బీర్ కపూర్ పాల్గొన్నారుష ఈ క్రమంలోనే వీరిని చూడడానికి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఎగబడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ సినిమా ట్రైలర్లో మొదటి నుంచి చివరి దాకా తండ్రి కొడుకుల థీమ్ తోనే డిజైన్ చేశారు సందీప్ రెడ్డి వంగా. అనిల్ కపూర్, రణబీర్ కపూర్ మధ్య వచ్చే సన్నివేశాలే కాదు. రష్మిక తో ఉన్నవి బాబి డియోల్ తో కనిపించినవి ఇలా ప్రతి షార్ట్ లోను ఫాదర్ ఎమోషన్ ని డైరెక్టర్ చూపించారు.

అర్జున్ రెడ్డి రీమేక్ తర్వాత సందీప్ రెడ్డి వంగ చేస్తున్న సినిమా ఇది. అమ్మాయిని మనసారా ప్రేమించిన అర్జున్ రెడ్డిని సైకిక్ లవ్ అన్నారు. ఇప్పుడు యానిమల్ సినిమాలో తండ్రి మీద కొడుకు చూపించే ప్రేమ కూడా అలాగే కనిపిస్తుందని కొందరు అంటున్నారు. సందీప్ రెడ్డి మార్క్ ప్రేమ ఇలాగే ఉంటుందని కామెంట్ చేస్తున్నారు. ఇక ట్రైలర్ లో రణబీర్ కపూర్ ని ఫుల్ యాక్షన్ గా చూపించారు. తండ్రి కోసం ఏమైనా చేసే కొడుకుగా రణ్బీర్ కపూర్ ని దర్శకుడు చూపించారు. ఫాదర్ సెంటిమెంట్ తో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది