Sukumar : సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం 2’ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sukumar : సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం 2’

 Authored By govind | The Telugu News | Updated on :23 April 2021,5:18 pm

Sukumar : చిరుత తో జర్ని స్టార్ట్ చేసి రంగస్థలం తో చిట్టి బాబు గా తన నటన తో మెప్పించిన మెగ పవర్ స్టార్ మన రాం చరణ్ తో ది మోస్ట్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ రంగస్థలం 2 ని తెరకెక్కించబోతున్నట్లు ఇండస్ట్రీలో గుస గుస మొదలైంది. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప’ తో బిజీగా ఉన్న సుకుమార్ విజయ్ దేవరకొండ హీరోగా సినిమా చేసిన తర్వాత రాం చరణ్ తో రంగస్థలం 2 చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. విజయ్ దేవరకొండ సినిమా తర్వాత సుకుమార్ మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా చేస్తాడని అందరు అనుకున్నారు. కథ కూడా సీరియస్ గా చర్చించారన్న సమాచారం ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందింది. కాని ఇప్పుడు తన డేసిషన్ ని మార్చుకున్నాడట.

ఇదిలా ఉండగా సుకుమార్ రాం చరణ్ కాంబోలో వచ్చిన ‘రంగస్థలం’ సూపర్ హిట్ గా నిలిచి అన్ని వర్గాల వారిని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. చిట్టి బాబుగా రాంచరణ్ 100% తన ఫ్యాన్స్ ని మరియు ప్రేక్షకులని సాటిసిఫై చేశాడు. ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో అల్లూరి సీతారామ రాజుగా మన అందరి మనసులను గెలుచుకోవాలని ఇదొక చాలెంజింగ్ రోల్ కాబట్టి ఇంతక ముందేన్నడు చేయని పాత్ర కాబట్టి తన సత్తాను పూర్తిగా చాటేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.

rangasthalam 2

rangasthalam 2

Sukumar : సుకుమార్ చిరంజీవితో  సినిమా చేయబోతున్నాడా లేదా…?

మరొవైపు ఈ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో వచ్చే ప్రాజెక్ట్ లో జులై లో జాయిన్ అవడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాని తొందరగా అంటే వచ్చే ఏడాది లోపు పూర్తి అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ లోపు సుకుమార్ పుష్ప సినిమాని, విజయ్ దేవరకొండతో కమిట్ అయిన సినిమాను పూర్తి చేసి  వెంటనే చరణ్ తో రంగస్థలం 2 ను మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయట. మరి చిరంజీవితో సుకుమార్ సినిమా చేయబోతున్నాడా లేదా అనేది వేచి చూడాలి. అయితే చరణ్ సుకుమార్ ల కాంబినేషన్ మూవీ పై క్లారిటీ అధికారికంగా రావాల్సి ఉందటా.

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది