Rashi Khanna : తెరిచి ఉంచాలని చాలా ప్రయత్నిస్తున్నా!.. రాశీ ఖన్నా కష్టాలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rashi Khanna : తెరిచి ఉంచాలని చాలా ప్రయత్నిస్తున్నా!.. రాశీ ఖన్నా కష్టాలు

Rashi Khanna : రాశీ ఖన్నా ఇప్పుడు పలు సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉంది. తెలుగు, తమిళ, బాలీవుడ్ చిత్రాలతో రాశీ ఖన్నా దూసుకుపోతోంది. తెలుగు, తమిళం, హిందీలో ఓ వెబ్ సిరీస్ చేస్తోన్నట్టు కనిపిస్తోంది. అలా క్షణం తీరిక లేకుండా అక్కడా ఇక్కడా అంటూ దుమ్ములేపుతోంది. అయితే ఇలా విరామం లేకుండా షూటింగ్‌లు చేస్తుండటటంతో రాశీ ఖన్నా తెగ అలిసిపోయినట్టు కనిపిస్తోంది. ఇదే విషయాన్ని రాశీ ఖన్నా చెప్పుకొచ్చింది. ఈ మేరకు తాను ఎంత అలిసిపోయానే […]

 Authored By bkalyan | The Telugu News | Updated on :10 October 2021,2:25 pm

Rashi Khanna : రాశీ ఖన్నా ఇప్పుడు పలు సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉంది. తెలుగు, తమిళ, బాలీవుడ్ చిత్రాలతో రాశీ ఖన్నా దూసుకుపోతోంది. తెలుగు, తమిళం, హిందీలో ఓ వెబ్ సిరీస్ చేస్తోన్నట్టు కనిపిస్తోంది. అలా క్షణం తీరిక లేకుండా అక్కడా ఇక్కడా అంటూ దుమ్ములేపుతోంది. అయితే ఇలా విరామం లేకుండా షూటింగ్‌లు చేస్తుండటటంతో రాశీ ఖన్నా తెగ అలిసిపోయినట్టు కనిపిస్తోంది. ఇదే విషయాన్ని రాశీ ఖన్నా చెప్పుకొచ్చింది. ఈ మేరకు తాను ఎంత అలిసిపోయానే చెప్పుకొచ్చింది.

Rashi Khanna Tried With Continous Shooting

Rashi Khanna Tried With Continous Shooting

రాశీ ఖన్నా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. తన అభిమానులతో రాశీ ఖన్నా టచ్‌‌లో ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ చేస్తూ అలరిస్తూనే ఉంటుంది. ఇక మధ్య మధ్యలో లైవ్ సెషన్స్ పెట్టి ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది. ఇక రాశీ ఖన్నా షేర్ చేసే ఫోటో షూట్లు మాత్రం మామూలుగా ఉండవు. లంగావోణిలో కనిపించినా, మోడ్రన్ దుస్తుల్లో కనిపించినా, కురచ దుస్తులు ధరించినా కూడా రాశీ ఖన్నా రచ్చ చేస్తుంది.

అలిసిపోయిన రాశీ ఖన్నా..

Rashi Khanna Tried With Continous Shooting

Rashi Khanna Tried With Continous Shooting

అయితే రాశీ ఖన్నా తాజాగా ఫుల్లుగా అలిసిపోయినట్టు అనిపిస్తోంది. పొద్దంతా షూటింగ్‌లతో బిజీగా ఉండటం వల్ల కళ్లు మూతలు పడుతున్నాయేమో. నిద్రపోయేందుకు రాశీ ఖన్నా తెగ ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోంది. అలా ఫ్లైట్‌లో చెన్నై వెళ్తోన్న రాశీ ఖన్నా మార్గమధ్యలో ఓ కునుకు తీయాలని చూసినట్టుంది. కళ్లు తెరిచి ఉంచడం చాలా కష్టంగా ఉంది.. మూతలు పడుతున్నాయి.. గుడ్ మార్నింగ్.. చెన్నైకి వెళ్తున్నాను అంటూ రాశీ ఖన్నా చెప్పుకొచ్చింది.

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది