SIIMA | సైమా 2025.. ఉత్తమ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, ఉత్తమ నటి సాయి పల్లవి
SIIMA | ‘సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2025’ (సైమా 2025) ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా రెండు రోజుల పాటు దుబాయ్‌లో నిర్వహించారు. ముందు రోజు తెలుగు, కన్నడ పరిశ్రమలకి సంబంధించిన అవార్డ్ వేడుక జరగగా, ఆ తర్వాత తమిళం, మలయాళం ఇండస్ట్రీలకు పురస్కారాలు సమర్పించారు.కోలీవుడ్ నుంచి ఉత్తమ చిత్రంగా ‘అమరన్ ఎంపిక కాగా, , అదే చిత్రానికి సాయి పల్లవి ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకున్నారు. ఉత్తమ నటుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ కు అవార్డులు అందాయి.

#image_title
‘సైమా 2025’ విజేతల జాబితా (తమిళం)
బెస్ట్ డైరెక్టర్: రాజ్‌కుమార్ పెరియసామి (అమరన్)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్: జీవీ ప్రకాశ్‌కుమార్ (అమరన్)
బెస్ట్ యాక్టర్ ఇన్ నెగెటివ్ రోల్: అనురాగ్ కశ్యప్ (మహారాజ్)
బెస్ట్ యాక్టర్ ఇన్ ఏ కామెడీ రోల్: బాల శరవణన్ (లబ్బర్ పందు)
బెస్ట్ యాక్టర్ ఇన్ ఏ లీడింగ్ రోల్ – క్రిటిక్స్ ఛాయిస్: కార్తి (మెయ్యజగన్)
బెస్ట్ యాక్టర్ ఇన్ ఏ లీడింగ్ రోల్ (ఫిమేల్) – క్రిటిక్స్ ఛాయిస్: దుషారా విజయన్ (రాయన్)
బెస్ట్ డైరెక్టర్ – క్రిటిక్స్ ఛాయిస్: నిథిలన్ సామినాథన్ (మహారాజ్)
స్పెషల్ రైజింగ్ స్టార్: హరీశ్ కల్యాణ్(లబ్బర్ పందు)
స్పెషల్ అవార్డ్ – ఫ్రెష్ ఫేస్: సంజనా కృష్ణమూర్తి(లబ్బర్ పందు)
బెస్ట్ డెబ్యూ డైరెక్టర్: తమిళరాసన్(లబ్బర్ పందు)
‘సైమా 2025’ విజేతల జాబితా (మలయాళం)
బెస్ట్ డైరెక్టర్:** బ్లెస్సీ (ది గోట్ లైఫ్)
బెస్ట్ యాక్టర్ ఇన్ ఏ లీడింగ్ రోల్ (ఫిమేల్):ఊర్వశి (ఉళ్లోళుక్కు)
బెస్ట్ యాక్టర్ ఇన్ ఏ కామెడీ రోల్: శ్యామ్‌మోహన్ (ప్రేమలు)
బెస్ట్ యాక్టర్ ఇన్ ఏ నెగెటివ్ రోల్: జగదీష్ (మార్కో)
బెస్ట్ యాక్టర్ ఇన్ ఏ లీడింగ్ రోల్ (మేల్) – క్రిటిక్స్ ఛాయిస్: ఉన్ని ముకుందన్ (మార్కో)
బెస్ట్ డెబ్యూ డైరెక్టర్: జోజూ జార్జ్ (పని)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్: దిబు నినన్ థామస్ (ఏఆర్‌ఎం)