Intinti Gruhalakshmi 11 Oct Monday Episode : నందు, లాస్య వల్లే శృతితో తన పెళ్లి జరగడం లేదని తెలుసుకున్న ప్రేమ్ ఏం చేస్తాడు?
Intinti Gruhalakshmi 11 Oct Monday Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ సోమవారం 11 అక్టోబర్ 2021, రేపటి ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నందు.. శృతితో మాట్లాడటం చూసిన తులసి తర్వాత శృతిని నిలదీస్తుంది. నువ్వు నందుతో మాట్లాడటం చూశా నేను. నువ్వు ఏ విషయంలో నందు మాట విన్నావో కానీ.. నీ ప్రేమను నువ్వు ఎందుకు చంపేసుకుంటున్నావు. నేను ప్రేమ్ ను ప్రేమిస్తున్నాను అని ఒక్క మాట చెప్పు.. వెంటనే అక్షర స్థానంలో నిన్ను కూర్చోబెడతా.. అని అంటుంది తులసి. కానీ.. శృతి మాత్రం ఎప్పుడూ మీ కొడుకు గురించేనా.. మీ కొడుకు ప్రేమను గెలిపించడం కోసం మీరు తాపత్రయపడుతున్నారు కానీ.. నా గురించి ఆలోచించరా.. అని చెప్పి శృతి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

intinti gruhalakshmi 11 october 2021 episode highlights
కట్ చేస్తే.. ప్రేమ్, అక్షర పెళ్లి పనులు ఘనంగా జరుగుతుంటాయి. అమ్మా తులసి.. నాకంటే చిన్నదానివే అయినా నీ పెద్ద మనసుకు నా రెండు చేతులు జోడిస్తున్నా.. అని తులసితో అంటాడు జీకే. నా కూతురును నీ కూతురులా చూసుకుంటానని నాకు మాట ఇవ్వు అమ్మా.. అంటాడు జీకే. దీంతో తులసికి ఏం చేయాలో అర్థం కాదు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు.. నిన్ను ఇబ్బంది పెడుతున్నానా.. అంటాడు జీకే. నువ్వు మాట ఇవ్వకపోయినా ఆ బాధ్యత తీసుకుంటావని తెలుసు. కానీ.. నా తృప్తి కోసం అడుగుతున్నానమ్మా.. అని అంటాడు జీకే.
Intinti Gruhalakshmi 11 Oct Monday Episode : శృతితో మాట్లాడిన ప్రేమ్
తన రూమ్ లో వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది శృతి. నా గమ్యం ఎటు వెళ్తుందో తెలియడం లేదు.. అని అనుకుంటుంది. ఇంతలో ప్రేమ్ వచ్చి శృతి అని అడుగుతాడు. ఏంటి అలా చిత్రంగా చూస్తున్నావు. నువ్వు కోరుకున్నది అదే కదా. మరో అమ్మాయితో పెళ్లి జరగాలనే కదా నువ్వు కోరుకున్నది. ఇప్పుడు ఎలా ఉన్నాను అని అడిగితే మాట్లాడటం లేదు ఏంటి.. అంటాడు ప్రేమ్.
ఇంతలో నందును పిలిచి తులసి మాట్లాడుతుంది. ఒక్కసారి అక్షర వంక చూడండి.. ఎంత అమాయకంగా ఉందో. అక్షర కూర్చున్న స్థానం శృతిది. మీ పంతం వల్లే అక్షర అక్కడ కూర్చుంది. ఒక్కసారి ఆలోచించండి. భార్య స్థానంలో ఉన్న అక్షరకు ప్రేమ్ న్యాయం చేయగలడా? అని తులసి.. నందును ప్రశ్నిస్తుంది.

intinti gruhalakshmi 11 october 2021 episode highlights
తర్వాత తులసితో ప్రేమ్ మాట్లాడుతాడు. అంత ప్రేమ్ ను మనసులో దాచుకోవడం ఎందుకు.. మౌనంగా ఏడవడం ఎందుకు.. అని తులసిని అడుగుతాడు ప్రేమ్. అక్షరతో నీ పెళ్లి జరగాలని శృతి అలా మాట్లాడింది అని అంటుంది తులసి. నా మీద ఉన్న ప్రేమను దాచుకొని.. నా పెళ్లి అక్షరతో జరగాలని శృతి ఎందుకు అనుకుంటోంది అని అడుగుతాడు ప్రేమ్. దీంతో మీ నాన్నను, లాస్యను చూసి భయం అని అంటుంది తులసి. వాళ్లేం చేశారు అనగానే.. నిన్ను పెళ్లి చేసుకుంటే.. మన కుటుంబాన్ని నాశనం చేస్తామని భయపెట్టారు.. అంటుంది తులసి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.