Sreemukhi : కొత్త కారు కొన్న శ్రీముఖి.. అతనితో కలిసి హల్చల్
Sreemukhi : బుల్లితెర, వెండితెరపై శ్రీముఖికి ఉన్న క్రేజ్ వేరు. వెండితెరపై సపోర్టింగ్ రోల్స్‌తో దుమ్ములేపిన శ్రీముఖి.. క్రేజీ అంకుల్స్ అంటూ రచ్చ చేసింది. ఆ సినిమా అంతగా వర్కవుట్ కాకపోయినా కూడా శ్రీముఖికి మాత్రం మంచి క్రేజ్ దక్కింది. అలా వెండితెర, బుల్లితెర మీద శ్రీముఖి దూసుకుపోతోంది. రెండు వైపులా సంపాదిస్తోన్న శ్రీముఖి.. ఇప్పుడు కొత్త కారును కొనేసింది. అది కూడా తన తమ్ముడికి బహుమతిగా ఆ కారును కొనేసింది. మొత్తానికి తమ్ముడికి కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చింది.
ఫోర్డ్ కారును కొన్న శ్రీముఖి సోదరుడికి గిఫ్ట్‌గా ఇచ్చింది. అయితే శ్రీముఖి కొన్న కొత్త కారుపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఫోర్డ్ సంస్థ తన వ్యాపార కార్యక్రమాలను ఇండియాలో నిలిపివేస్తున్నట్టు ప్రకటన చేయడంతో.. ఆ కంపెనీ కారు ఎందుకు కొన్నావంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే సర్వీస్ సెంటర్లు పదేళ్ల వరకూ ఉంటాయని నెటిజన్లు స్పందనలు తెలియజేస్తున్నారు. శ్రీముఖికి ఈ విషయం తెలిసే కారుని కొనుగోలు చేసిందా? లేదంటే తమ్ముడు మనసు పడ్డాడు కదా అని ఎరక్కపోయి ఇరుక్కుపోయిందా? అనే కామెంట్లూ వినిపిస్తున్నాయి.
తమ్ముడికి కారు గిఫ్ట్ ఇచ్చిన శ్రీముఖి
అయితే శ్రీముఖి 2019 మార్చిలో ఖరీదైన బెంజ్ కారుని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఆ కారులోనే శ్రీముఖి గ్యాంగ్ బయటకు వెళ్తోంది. శ్రీముఖి షేర్ చేసే టూర్ వీడియోల్లో కనిపించే బెంజ్ కారు శ్రీముఖిదే. అలా ఇప్పుడు వారింట్లో కొత్త కారు కూడా వచ్చేసింది. తమ్ముడి కోసం భారీగా ఖర్చు పెట్టి మరీ కారు కొనిచ్చింది శ్రీముఖి. ఆమె సోదరుడు శుశ్రుత్ కూడా సోషల్ మీడియాలో బాగానే ఫేమస్. ఎప్పుడూ అక్కతో కనిపించడంతో ఫుల్ ఫేమస్ అయ్యాడు.