Rashmi Gautam : “బాయ్స్ హాస్టల్” ప్రమోషన్ కార్యక్రమాల్లో యాంకర్ రష్మీ సంచలన వ్యాఖ్యలు..!!

Advertisement

Rashmi Gautam : యాంకర్ రష్మి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జబర్దస్త్ ఇంకా చాలా టెలివిజన్ షోలతో మంచి గుర్తింపు సంపాదించింది. తన గ్లామర్ తో తెలుగు యువతలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. ఒకపక్క టెలివిజన్ రంగంలో మరోపక్క సినిమా రంగంలో అవకాశాలు అందుకుంటూ సక్సెస్ఫుల్ కెరియర్ తో రష్మీ దూసుకుపోతూ ఉంది. తాజాగా “బాయ్స్ హాస్టల్” అనే సినిమా చేయడం జరిగింది. ఈ సినిమాల ప్రధాన పాత్ర పోషించిన రష్మీ..”బాయ్స్ హాస్టల్” ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

Advertisement

మీడియా ప్రతినిధులు బాయ్స్ హాస్టల్ లో ఉంటూ ఎవరైనా మీకు ప్రపోజ్ చేశారా అని ఒకరు ప్రశ్నించగా.. లేదండి చాలా వయసు గ్యాప్ వచ్చేస్తది అని రష్మీ బదులు ఇవ్వడం జరిగింది. ఇక మీ హృదయాన్ని బాధపెట్టిన ప్రేమ సందర్భాలు ఏవైనా ఉన్నాయా అని మరొక మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. దానికి రష్మీ సమాధానమిస్తూ వాటి గురించి మాట్లాడాల్సి వస్తే.. చాలా టైం పడుతుంది.. అంటూ సమాధానం ఇచ్చింది.

Advertisement
Rashmi Gautam Emotional Words About Sudigali Sudheer
Rashmi Gautam Emotional Words About Sudigali Sudheer

జీవితంలో ప్రతి ఒక్కరికి హార్ట్ బ్రేక్స్ ఉంటాయి. 16 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు దాటినా కూడా.. హార్ట్ బ్రేక్స్ ఇంకా జరుగుతూనే ఉంటాయి. జీవితంలో ఇదొకటి భాగం అని చెప్పుకొచ్చింది. ఇక కామియక్ రోల్.. గురించి మాట్లాడుతూ..”భోళా శంకర్” లో చిరంజీవి పక్కన చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నట్లు రష్మి స్పష్టం చేసింది. ఇంకా ఇదే సమయంలో “బాయ్స్ హాస్టల్” సినిమా గురించి ఇంకా అనేక విషయాలు తెలియజేయడం జరిగింది.

Advertisement
Advertisement