Rashmi Gautam : రష్మీ గౌతమ్..ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు బాగా ఇష్టమైన పేరు. అటు బుల్లితెరపై ఇటు సిల్వర్ స్క్రీన్‌పై నటిస్తూ బాగా ఆకట్టుకుంటుంది.
తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అసాధారణం. రష్మీ స్మైల్ కి పడిపోయేవారు ఎందరో లెక్కేలేదు. యూత్‌లో రష్మీకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే ఎన్నో ప్రపోజల్స్ కూడా వచ్చాయి. ఇక రష్మీ ఈ స్థాయికి చేరుకుందంటే అది పూర్తిగా తన స్వయం కృషి మాత్రమే. అయితే గత కొన్ని రోజులుగా రష్మీ పలు విషయాలపై ఏమాత్రం ఆలోచించకుండా రియాక్ట్ అవుతోంది. ఎవరేమైనా అంటే అసలు మాట పడదు.
rashmi-gautam fires on netizens
ఇక, సుధీర్ – రష్మిలజంట గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. గత ఏడు ఎనిమిదేళ్లుగా సుధీర్ – రష్మిల జంట ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. వీరు కలిసి స్క్రీన్ మీద కనిపిస్తే చాలు టీఆర్పీ రేటింగ్ అలా పెరిగిపోతుంది. అయితే సుధీర్, రష్మీల వ్యక్తిగత విషయాలకు సంబంధించి ఇప్పటికే చాలా సందర్బాల్లో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వచ్చి హాట్ టాపిక్ అయ్యాయి. ఇంకా చెప్పాలంటే సుధీర్ – రష్మిల పెళ్లి గురించి అయితే లెక్కేలేదు. ఈటీవీ వారు షోలో భాగంగా వీరికి పెళ్ళి కూడా చేసేశారు.
కాగా, తాజాగా ట్రోల్స్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ రష్మీ వర్షకు సపోర్ట్ చేస్తూ మాట్లాడింది. ఎక్స్‌ట్రా జబర్దస్త్ తాజా ఎపిసోడ్‌లో ఈ సంఘటన జరిగింది. తనమీద వస్తున్న ట్రోల్స్ గురించి వర్ష.. జబర్దస్త్ స్టేజి మీద ఎమోషన్ అవుతూ కన్నీళ్లి పెట్టుకుంది. తనపై వస్తున్న ట్రోల్స్ చూసి ఆమె తమ్ముడు ముఖం మీద ఫోన్ పెట్టి.. ఏంటక్కా ఇది అని అడిగితే తట్టుకోలేకపోయానని వాపోయింది వర్ష. దీనికి రష్మీ రియాక్ట్ అయింది.
‘అమ్మాయిలు, అబ్బాయిలు సమానం అంటారు. సుధీర్ ఎవరితో యాక్ట్ చేసినా ఒప్పుకుంటారు. కానీ నేను వేరే వాళ్లతో యాక్ట్ చేస్తే ఒప్పుకోరు. రీసెంట్‌గా నాది ఓ సినిమా ట్రైలర్ విడుదలైతే.. చాలా మంది సుధీర్‌తో ఉంటే బాగుంటదని కామెంట్స్ చేశారు. ఇక్కడ అందరం వర్క్ చేస్తున్నాం. మా పర్సనల్ లైఫ్ వేరే. కానీ వర్క్ పరంగా అది ఒప్పుకోవడం లేదు. అబ్బాయిల ఎంత మందితో పులిహోర కలిపిన పర్వాలేదు. కానీ అమ్మాయిలు క్యారెక్టర్ పరంగా వేరే వాళ్లతోని నటిస్తే ఒప్పుకోరు. అది ఎందుకో అర్థం కాదు.’ అని రష్మీ చెప్పుకొచ్చింది.
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
This website uses cookies.