Rashmi Gautam : ఎవరే నీకు అక్కా.. స్టేజ్ మీద వర్ష పరువు తీసిన రష్మీ గౌతమ్

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: July 7, 2022, 9:00 pm

Rashmi Gautam : యాంకర్‌గా రష్మీకి ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. ఇన్ని రోజులు జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ అంటూనే రష్మీ కనిపించింది. కానీ రష్మీకి ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ వచ్చింది. శ్రీదేవీ డ్రామా కంపెనీకి కూడా యాంకర్‌గా మారిపోయింది. సుధీర్ వెళ్లిపోవడంతో ఆ స్థానంలోకి రష్మీ వచ్చింది. రష్మీ బాగానే నడిపిస్తోంది. అయితే సుధీర్ లేని లోటును మాత్రం ఎవ్వరూ తీర్చలేరు. శ్రీదేవీ డ్రామా కంపెనీలో సుధీర్ లేకపోయినా కూడా పరోక్షంగా మాత్రం అతడి గురించి కౌంటర్లు వేస్తూనే ఉన్నారు. బాబు అంటూ ఆది, రాం ప్రసాద్ ఇద్దరూ కూడా రష్మీని ఏడిపిస్తున్నారు. సుధీర్ రష్మీ ట్రాక్‌ను పరోక్షంగా వాడేస్తున్నారు.

అయితే తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో అందరూ రష్మీని కార్నర్ చేశారు. ఆషాడం కదా? భార్యభర్తలు ఒక చోట ఉండొద్దని అంటుంటారు.. ఇలానే వర్ష కౌంటర్లు వేయబోయింది. అక్కా ఆషాడం కదా? నువ్ ఇక్కడున్నావ్.. బావ అక్కడున్నాడు అంటూ రష్మీ మీద వర్ష కౌంటర్లు వేసేందుకు ప్రయత్నించింది. దీంతో రష్మీకి చిర్రెత్తుకొచ్చినట్టుంది. ఎవరే నీకు అక్కా.. ఎవరే నీకు అక్కా.. వెళ్లి కూర్చో అంటూ రష్మీ మీద మీదకు వచ్చింది. ఆ వెంటనే ఆది అందుకున్నాడు. రష్మీ అంటూ తీయగా పిలిచాడు.. హా ఏంటి అంటూ రష్మీ కాస్త గట్టిగా అడిగింది. అందరికీ ఆషాడం నెల ఉంటే..

Rashmi Gautam Fires on Varsha In Sridevi Drama Company Promo

Rashmi Gautam Fires on Varsha In Sridevi Drama Company Promo

మీకు మాత్రం ఓ ఏడాది ఉండేలా కనిపిస్తోందంటూ ఆది పంచ్ వేస్తాడు. అంటే ఇంకో ఏడాది వరకు సుధీర్, రష్మీ కలిసి ఏ షోలోనూ కనిపించకపోవచ్చన్నమాట. ఆది ఆ ఉద్దేశ్యంతోనే డైలాగ్ వేశాడా? లేదంటే కామన్‌గానే వేశాడా? అన్నది తెలియడం లేదు. మొత్తానికి సుధీర్ ప్రస్థావన లేకపోతే మాత్రం ఆ ప్రోమో ప్రోమోలా ఉండదు.. ఎపిసోడ్ ఎపిసోడ్‌లా ఉండదని మరోసారి నిరూపించారు. ఇక యూట్యూబ్‌లో వీడియోల కింద మాత్రం వి మిస్ యూ సుధీర్ అన్నా.. నువ్ మళ్లీ ఈ షోలోకి రావాలి.. నువ్వొస్తేనే మేం చూస్తామంటూ ఇలా సుధీర్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి వచ్చే ఆదివారం మాత్రం శ్రీదేవీ డ్రామా కంపెనీ దుమ్ములేపేలా ఉంది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp