Rashmi Gautam : మళ్లీ జబర్దస్త్‌ ను ఏక చత్రాధిపత్యంగా ఏళబోతున్న రష్మీ గౌతమ్‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rashmi Gautam : మళ్లీ జబర్దస్త్‌ ను ఏక చత్రాధిపత్యంగా ఏళబోతున్న రష్మీ గౌతమ్‌

 Authored By prabhas | The Telugu News | Updated on :7 June 2022,1:00 pm

ఈటీవీలో జబర్దస్త్‌ ప్రారంభం అయ్యి దాదాపుగా పది సంవత్సరాలు అవుతుంది. షో ఆరంభంలో వారంలో ఒక్క ఎపిసోడ్‌ మాత్రమే ఉండేది. ఆ ఎపిసోడ్‌ కు అనసూయ యాంకరింగ్‌ చేసేది. యాంకర్ గా అనసూయకు మంచి పేరు వచ్చింది. ఆ సమయంలో అనసూయ ను యాంకర్ గా అన్ని వర్గాల వారు ఆధరించారు. అందరు కూడా అనసూయ ను అభిమానించడం మొదలు పెట్టారు. జబర్దస్త్‌ లో సెటిల్‌ అవుతుంది అనుకుంటున్న సమయంలో ఆమె తప్పుకుంది. దాంతో ఆమె స్థానంలో రష్మీ గౌతమ్ ఎంట్రీ ఇచ్చింది. ఈమె నటిగా చాలా సినిమాల్లో నటించిన అవేవి గుర్తింపు తెచ్చి పెట్టలేదు.

హీరోయిన్ గా రష్మీ గౌతమ్‌ చేస్తున్న సమయంలో రాని గుర్తింపు జబర్దస్త్‌ షో తో వచ్చింది. అనసూయ వెళ్లి పోయిన తర్వాత రష్మి గౌతమ్‌ ఏకచత్రాధిపత్యం అన్నట్లుగా రెండు జబర్దస్త్‌ ఎపిసోడ్‌ లను కూడా రష్మి హోస్ట్‌ చేసింది. అనసూయ మళ్లీ తిరిగి రావడంతో ఆమెకు మరో అవకాశం అన్నట్లుగా జబర్దస్త్‌ కు అనసూయ మరియు ఎక్స్‌ ట్రా జబర్దస్త్‌ కు రష్మికి అవకాశం ఇచ్చారు. దాదాపు ఏడు సంవత్సరాలుగా ఇద్దరు రెండు వేరు వేరు జబర్దస్త్‌ లకు యాంకరింగ్‌ చేస్తున్నారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత రష్మి జబర్దస్త్‌ లో ఏకచత్రాధిపత్యం గా యాంకరింగ్‌ చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.జబర్దస్త్‌ నుండి పలువురు కమెడియన్స్ వెళ్లి పోయినట్లుగానే హాట్ యాంకర్ అనసూయ కూడా వెళ్లడం

Rashmi Gautam is the only anchor of jabardasth and sridevi drama company

Rashmi Gautam is the only anchor of jabardasth and sridevi drama company

దాదాపుగా కన్ఫర్మ్‌ అయ్యిందట. అనసూయ వెళ్లి  పోతే రెండు ఎపిసోడ్స్ కు కూడా రష్మి ని యాంకర్ గా ఎంపిక చేయబోతున్నారు. తద్వారా ఆమె సత్తా మళ్లీ చాటుతుందని అంటున్నారు. ఈమద్య యాంకర్ గా మాత్రమే కాకుండా స్పెషల్‌ స్కిట్స్ లో కూడా ఇరగదీస్తుంది. గత రెండు మూడు వారాలుగా వరుసగా రామ్‌ ప్రసాద్ తో కలిసి స్కిట్‌ లు చేస్తుంది. జబర్దస్త్‌ మాత్రమే కాకుండా లక్కీగా ఈ అమ్మడికి శ్రీదేవి డ్రామా కంపెనీ కి యాంకర్ గా కూడా వ్యవహరించే అవకాశం దక్కింది. మొత్తానికి ఇక నుండి రష్మీ సందడి మామూలుగా ఉండదని అభిమానులు అంటున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది