Rashmi Gautam : కాళ్ల అందాలు చూపుతూ.. ఒంటికాలు జపంతో కాకరేపుతున్న రష్మి..
Rashmi Gautam : బుల్లితెర యాంకర్స్‌లో హాట్ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న రష్మి గౌతమ్.. చూడటానికి అలా కనిపిస్తుంది. కానీ రష్మిగౌతమ్‌లో మరో కోణం కూడా ఉందండోయ్.. మూగ జీవుల పట్ల ప్రేమను చూపుతూ, వాటి పట్ల హింసకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఫైట్ చేస్తోంది రష్మి. కొవిడ్ కట్టడికి విధించిన లాక్ డౌన్ టైంలో మూగజీవాలైన కుక్కులకు ఫుడ్ సప్లై చేసిన రష్మి.. ఇప్పటికీ పలు ఏరియాల్లో వాటికి ఫుడ్ తన సొంత డబ్బులతో అందజేస్తున్నది.
ఇకపోతే రష్మి గౌతమ్ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఏదో ఏరియాలో కుక్కను కొట్టి మరి చంపేందుకు ప్రయత్నిస్తున్న సిబ్బందికి సంబంధించిన వీడియోను షేర్ చేసి మనకు అసలు భూమ్మీద బతికే హక్కు ఉందా అని ప్రశ్నించింది రష్మి. ఇలా సోషల్ ఇష్యూస్ గురించి మాట్లాడే అప్పుడప్పుడు తన హాట్ ఫొటోలు కూడా నెట్టింట షేర్ చేసి అగ్గి రాజేస్తుంటుంది. తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా రష్మి గౌతమ్ ‘తనను ప్రేమిస్తే ఎదరయ్యే ఓటమే’ అనే క్యాప్షన్‌తో హాట్ ఫొటోను పోస్ట్ చేసింది.
Rashmi Gautam : తనను ప్రేమిస్తే ఎదురయ్యేది ఓటమేనంటున్న రష్మి..
సదరు ఫొటోలో రష్మి ఒంటి కాలు జపం చేస్తుండటం విశేషం. బ్లూ కలర్‌లో ఉన్న పొట్టి గౌన్ ధరించి ఉన్న రష్మి ఫొటోను చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫొటోలో రష్మి తన కాళ్ల అందాలను ప్రదర్శించింది. రష్మి ధరించిన డ్రెస్సు మోకాలి పైన వరకు ఉండటం గమనార్హం. ఈ ఫొటో చూసి నెటిజన్లు ‘సెక్సీ, లవ్ యూ, బ్యూటిఫుల్’ అని కామెంట్స్ చేస్తుండగా, ఈ ఫొటోను టాలెంటెడ్ హీరోయిన్ ప్రియమణి లైక్ చేయడం విశేషం.