Rashmi Gautam : గోదావరిలో ఆస్థిక‌లు క‌లిపి ఫుల్ ఎమోష‌నల్ అయిన ర‌ష్మీ గౌత‌మ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rashmi Gautam : గోదావరిలో ఆస్థిక‌లు క‌లిపి ఫుల్ ఎమోష‌నల్ అయిన ర‌ష్మీ గౌత‌మ్

 Authored By ramu | The Telugu News | Updated on :9 March 2025,6:30 pm

ప్రధానాంశాలు:

  •  Rashmi Gautam : గోదావరిలో ఆస్థిక‌లు క‌లిపి ఫుల్ ఎమోష‌నల్ అయిన ర‌ష్మీ గౌత‌మ్

Rashmi Gautam : అటు వెండితెర ఇటు బుల్లితెర రెండింటిలోనూ క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ రష్మీ గౌతమ్. ముఖ్యంగా ఎక్స్‌ట్రా జబర్దస్త్ షో ద్వారా బీభత్సమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ‌ శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ డ్యాన్స్ షో సహా పలు టీవీ షోలు, ఫెస్టివల్ ఈవెంట్స్‌లో సంద‌డి చేస్తూ అల‌రిస్తూ ఉంటుంది.అయితే ర‌ష్మీ గౌత‌మ్ రీసెంట్‌గా అస్థికలను తీసుకొచ్చి రాజమండ్రి గోదావరి నదిలో కలిపింది. ఈ వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Rashmi Gautam గోదావరిలో ఆస్థిక‌లు క‌లిపి ఫుల్ ఎమోష‌నల్ అయిన ర‌ష్మీ గౌత‌మ్

Rashmi Gautam : గోదావరిలో ఆస్థిక‌లు క‌లిపి ఫుల్ ఎమోష‌నల్ అయిన ర‌ష్మీ గౌత‌మ్

Rashmi Gautam ఎవ‌రి అస్థిక‌లు అంటే..

ర‌ష్మీ ఎవ‌రి అస్థిక‌లు క‌లిపింది అనే క‌దా డౌట్.. తన పెంపుడు కుక్క చుట్కీ అస్థికలు గోదావరి నదిలో కలిపింది. ఇటీవల కొన్ని రోజుల క్రితం రష్మీ పెంపుడు కుక్క చుట్కీ మ‌ర‌ణించ‌గా, ఆ విష‌యాన్ని త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది. ఇక ఎంతో ప్రేమగా చూసుకున్న కుక్క చుట్కీ అస్థికలు రాజమండ్రికి తీసుకు వచ్చి గోదావరి నదిలో కలిపిన విష‌యాన్ని కూడా షేర్ చేసింది

ర‌ష్మీ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక ఇటీవ‌ల ర‌ష్మీ ఆసుపత్రి బెడ్డుపై ఉన్న ఫొటోని షేర్ చేస్తూ ఓ క్యాప్షన్ ఇచ్చింది. “నేను సర్జరీ చేయించుకునేందుకురెడీ అయ్యాను. నా భుజాన్ని సరి చేసుకోవాల్సిన సమయం వచ్చింది. దీని వల్ల నాకు ఇష్టమైన డాన్స్ చేయలేకపోతున్నాను. ఫ్రీగా డ్యాన్స్ చేసేందుకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ సర్జరీ అయ్యాక పూర్తిగా సెట్ అవుతుందని నమ్ముతున్నా” అంటూ రష్మీ చెప్పుకొచ్చింది. ర‌ష్మీ స‌ర్జ‌రీ కూడా స‌క్సెస్ అయిన‌ట్టు తెలుస్తుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది