Home » Entertainment » Rashmi Gautham Comments
Entertainment

Rashmi Gautham : అది కూడా రేప్‌తో స‌మానం.. ర‌ష్మీ గౌత‌మ్ స్ట‌న్నింగ్ కామెంట్స్

Authored By
Sam C
The Telugu News | Published on: May 18, 2022, 9:00 pm
Advertisement

Rashmi Gautham : జ‌బ‌ర్ధ‌స్త్ షోతో యాంకర్‌గా మంచి పాపులారిటీ ద‌క్కించుకున్న ర‌ష్మీ గౌత‌మ్ త‌న అంద‌చందాల‌తోనే కాకుండా ప‌ర్‌ఫార్మెన్స్‌తోను అద‌ర‌గొడుతుంటుంది. సోష‌ల్ మీడియాలో అమ్మ‌డి ర‌చ్చ మాములుగా ఉండ‌దు. మూగ జీవాల పట్ల స్పందించే విధానానికి ఎంతో మంది అభిమానులున్నారు. రష్మీ గౌతమ్ జంతు ప్రేమికురాలు. వీధి కుక్కలపై రష్మీ ప్రత్యేక శ్రద్దను కనబరుస్తుంటుంది. జంతువులను హింసించే, బలి ఇచ్చే ఆచారాల మీద రష్మీ గౌతమ్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటుంది. జీవ హింసకు వ్యతిరేకంగా పోరాడుతుంటుంది. పెట్స్ కోసం రష్మీ ప్రత్యేక శ్రద్దను తీసుకుంటారు.

Advertisement

రోడ్డుపై పెట్స్ గాయపడినట్టు కనిపిస్తే.. వాటికి వైద్యం అందిస్తుంటారు. లేదా వాటిన తనతో పాటే ఇంటికి కూడా తీసుకెళ్తుంటారు. అలా మూగ జీవాల మీద రష్మీ ప్రేమను కురిపిస్తుంటారు.జంతువుల‌పై ప్రేమ‌తో ర‌ష్మి అయితే పాలు, పాల ఉత్పత్తులకు దూరంగా ఉంటుంది. మన రోజూ తాగే పాల కోసం డైయిరీలో జంతువులను ఎంతగా హింసిస్తారో ఇది వరకు ఎన్నో సార్లు రష్మి వీడియోల ద్వారా చూపించారు. తాజాగా మరోసారి ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. మనం రోజూ తాగే పాల కోసం జంతువులను ఇలా చేస్తుంటారు.. అని ఓ వీడియోను చూపించారు. ఆ వీడియోలో బర్రెకు సూదులు గుచ్చడం, రిప్రొడక్టివ్ కోసం ఇలా చేస్తుంటారు..

rashmi gautham comments

Advertisement

Rashmi Gautham : ర‌ష్మీ గౌత‌మ్ షాకింగ్ కామెంట్స్..

డైయిరీ ఇండస్ట్రీలో ఇది నిత్యం జరుగుతుంటుంది అని ఆ వీడియోలో చెప్పుకొచ్చారు.వీడియోపై స్పందించిన ర‌ష్మీ గౌత‌మ్.. ‘ఈ దారుణం జరగడానికి మనమే డబ్బులు చెల్లిస్తున్నాం.. ఇది కూడా రేప్ చేసినట్టే.. ఈ జంతువులకే స్వేచ్చగా జీవించే హక్కు లేదా?.. మనం రోజూ వాడే పదార్థాలు ఎక్కడి నుంచి ఎలా వస్తున్నాయో తెలుసుకోండి’ అంటూ రష్మీ చెప్పుకొచ్చారు. ప్ర‌స్తుతం ప‌లు టీవీ షోస్‌తో బిజీగా ఉన్న ర‌ష్మీ గౌత‌మ్ సినిమాల‌లోను అల‌రిస్తుంది. భోళా శంక‌ర్ చిత్రంలో ర‌ష్మీ కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా, ఈ అమ్మ‌డి పాత్ర ఏమై ఉంటుంద‌నే ఆస‌క్తి అంద‌రిలో ఉంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి