Rashmi Gautham : అలా ప్ర‌వ‌ర్తించొద్దు.. ఏదైన చేయండి అంటూ ర‌ష్మీ గౌత‌మ్ అభ్య‌ర్ధ‌న‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rashmi Gautham : అలా ప్ర‌వ‌ర్తించొద్దు.. ఏదైన చేయండి అంటూ ర‌ష్మీ గౌత‌మ్ అభ్య‌ర్ధ‌న‌

 Authored By sandeep | The Telugu News | Updated on :22 June 2022,5:00 pm

Rashmi Gautham : బుల్లితెర‌పై సంద‌డి చేస్తూ అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కించుకున్న ముద్దుగుమ్మ‌ల‌లో ర‌ష్మీ గౌత‌మ్ ఒక‌రు. ఈ అమ్మ‌డు సినిమాలు, టీవీ షోస్ తో అల‌రించ‌డ‌మే కాక ఫొటో షూట్స్‌తోనే కేక పెట్టిస్తుంది. ర‌ష్మీ గౌత‌మ్ హంగామా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో అయితే మాములుగా లేదు.ఇక‌ షల్ మీడియాలో మూగ జీవాల పట్ల స్పందించే విధానానికి ఎంతో మంది అభిమానులున్నారు. రష్మీ గౌతమ్ జంతు ప్రేమికురాలు. వీధి కుక్కలపై రష్మీ ప్రత్యేక శ్రద్దను కనబరుస్తుంటుంది. జంతువులను హింసించే, బలి ఇచ్చే ఆచారాల మీద రష్మీ గౌతమ్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటుంది.

జీవ హింసకు వ్యతిరేకంగా పోరాడుతుంటుంది. ఎప్పుడు, ఎక్క‌డ ఏ ఇన్సిడెంట్ జ‌రిగిన వెంట‌నే స్పందిస్తుంటుంది. ర‌ష్మీ తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది. అందులో ఓ కుక్క అపాయంలో పడినట్టు కనిపిస్తోంది. ప్లాస్టిక్ డబ్బాలోకి కుక్క తన మూతిని దూర్చింది. దాంట్లోంచి తన మూతిని బయటకు తీసుకురాలేక సతమతమైనట్టుంది. అయితే యానిమల్ రెస్క్యూ టీం వచ్చి ఆ కుక్కని కాపాడే ప్రయత్నం చేసింది. కానీ ఇంతలో ఓ వ్యక్తి మాత్రం వారించాడు. దీనిపై యాంకర్ రష్మీ అసహనం వ్యక్తం చేసింది. కుక్కని రెస్క్యూ టీం కాపాడే స‌మ‌యంలో బ్యాక్ గ్రౌండ్‌లో ఓ అంకుల్ మాటలు వినండి..

rashmi gautham requests the citigens

rashmi gautham requests the citigens

Rashmi Gautham : ర‌ష్మీ ఆవేద‌న‌..

ఆయన అపార్ట్మెంట్ దగ్గర ఇలాంటి పనులు చేయొద్దని వెళ్లిపోమ్మని అంటున్నాడు.. కుక్క పట్ల కనీసం జాలి కూడా లేకుండా.. ఆ వ్య‌క్తి అలా మాట‌లు మాట్లాడ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్. మీరే ఆలోచించండి. అందుకే మీకు ఈ వీడియోను మొత్తం పెడుతున్నాను..మీరు కనీసం కుక్కకు అలాంటి పరిస్థితి వచ్చిందని యానిమల్ రెస్క్యూ టీంకు సమాచారం అందించండి చాలు.. వాళ్ల పనిని వాళ్లు చేయనివ్వండి.. కానీ ఇలాంటి అంకుల్‌లా మాత్రం వద్దని చెప్పకండి. మూగ‌జీవాలకు మీ వంతు సాయం చేయండి అని ర‌ష్మీ గౌత‌మ్ అభ్య‌ర్ధిస్తుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది