Rashmika Mandanna : ఒకరిపై ఒకరు దయతో ఉండండి.. రష్మిక పోస్ట్ నెట్టింట వైరల్
ప్రధానాంశాలు:
Rashmika Mandanna : ఒకరిపై ఒకరు దయతో ఉండండి.. రష్మిక పోస్ట్ నెట్టింట వైరల్
Rashmika Mandanna : ఇటీవల పుష్ప2తో మంచి బ్రేక్ అందుకున్న రష్మిక ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది . ఇటీవలి కాలంలో రష్మిక మందన్న పెళ్లి ముచ్చట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ ఏడాదిలోనే విజయ్, రష్మికలు పెళ్లి చేసుకుంటారని టాక్ వినిపిస్తోంది. అన్ స్టాపబులో షోలోనూ బాలయ్య ఈ పెళ్లి గురించి మాట్లాడాడు. నిర్మాత నాగవంశీ కూడా హింట్ ఇచ్చాడు. చూస్తుంటే ఈ ఏడాదిలోనే వీరు తమ తమ కమిట్మెంట్లకు కాస్త గ్యాప్ ఇచ్చి పెళ్లికి టైం కేటాయించేలా ఉన్నారు.
Rashmika Mandanna ట్వీట్ హాట్ టాపిక్..
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మిక మందన్న ఇటీవల పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. తన సినిమా విశేషాలను పంచుకునే ఆమె, తాజాగా “దయగా ఉండండి” అనే సందేశాన్ని పోస్ట్ చేశారు. ”ఈ రోజుల్లో అందరిలో దయ తగ్గిపోతోంది. నేను మాత్రం అందరినీ సమానంగా చూస్తాను. మీరు కూడా అలానే ఉండండి. ఒకరిపై ఒకరు దయగా ఉండాలి” అని రాశారు.
ఆమె ధరించిన టీ షర్ట్ మీద కూడా “దయ” అనే పదం రాసి ఉంది. ఈ పోస్ట్‌పై నెటిజన్లు వివిధ రకాల కామెంట్లు చేస్తున్నారు. రష్మిక మందన్న , విజయ్ దేవరకొండ జిమ్‌లో కలిసి కనిపించిన వీడియో ఒకటి వైరల్ అయింది. అయితే, జిమ్ నుంచి బయటకు వచ్చిన విజయ్ కారులో కూర్చొని ఉండగా, రష్మిక తన కాలికి గాయం కారణంగా కాస్త ఇబ్బందిపడుతూ కారు ఎక్కారు.