Rashmika Mandanna : ఇప్పుడు అది చేయాలని ఉంది.. మనసులో కోరికను బయటపెట్టిన రష్మిక

Authored By Cinema Desk | The Telugu News | Updated on: October 12, 2021, 3:21 pm

Rashmika Mandanna :  ఏ రంగంలో ఉన్న వారికైనా ఆ రంగానికి సంబంధించి కొన్ని కోరికలు ఉండటం సహజమే. హీరోయిన్ రష్మిక మందన కూడా అదే చెబుతోంది. కన్నడ మూవీ ‘కిరిక్ పార్టీ’ సినిమాతో కెమెరా ముందుకొచ్చిన ఈ బ్యూటీ.. ఆనతి కాలంలోనే భారీ ఫేమ్ కొట్టేసింది. ‘ఛలో’ అంటూ తెలుగు తెరపై కాలుమోపి స్టార్ స్టేటస్ పట్టేసింది. కెమెరా ముందు లుక్స్ పరంగా ప్రేక్షకులకు సరికొత్త ఫీల్ తెప్పిస్తూ వరుస ఆఫర్స్ పట్టేస్తోంది. అయితే ఇప్పుడు రష్మిక జోరు చూస్తే ఎవ్వరైనా సరే ఫిదా అవ్వాల్సిందేప.

Rashmika Mandanna About Fan Made Art

Rashmika Mandanna About Fan Made Art

దీంతో రష్మికపై పలు భాషా చిత్రాల దర్శకనిర్మాతల చూపు పడింది. తెలుగులో మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరూ సినిమాలో, నితిన్ సరసన భీష్మ సినిమాల్లో నటించి భారీ హిట్స్ ఖాతాలో వేసుకోవడంతో పలు హిందీ చిత్రాల్లో ఆమెను తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు అక్కడి మేకర్స్. ఈ నేపథ్యంలోనే మోస్ట్ క్రష్ ఆఫ్ ఇండియాగా ఫుల్ పాపులర్ అయింది ఈ ముద్దుగుమ్మ. అలా మొత్తానికి బాలీవుడ్ చిత్రాలు చేయకుండానే జాతీయ స్థాయిలో ఫేమస్ అయింది.

Rashmika Mandanna About Fan Made Art

Rashmika Mandanna About Fan Made Art

Rashmika Mandanna : ఇక రష్మిక ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందరో యూత్ ఆడియన్స్ గుండెల్లో గూడు కట్టుకుంది ఈ కన్నడ బ్యూటీ. అయితే రష్మికపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ ఓ బెంగాలీ కుర్రాడు ఆమె చిత్రపటాన్ని గీశాడు. దాన్ని తన సోషల్ మీడియా వాల్‌పై పోస్ట్ చేసిన రష్మిక.. ఈ చిత్ర పటం చూడముచ్చటగా ఉంది. దీన్ని చూస్తుంటే ఇక బెంగాలీ క్యారెక్టర్ చేయాలని ముచ్చటేస్తోంది. థాంక్యూ గైస్ అని పేర్కొంది. ప్రస్తుతం ఆమె చేతిలో ”పుష్ప, ఆడవాళ్ళూ మీకు జోహార్లు” సినిమాలతో పాటు మరో రెండు హిందీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp