Rashmika Mandanna : పొలం దున్నుతున్న రష్మిక మందాన్న.. అదే ఫీలింగ్ అంటూ పోస్ట్
Rashmika Mandanna : ప్రస్తుతం రష్మిక మందాన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేషనల్ క్రష్‌గా రష్మికకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. మామూలు ఫోటో షేర్ చేసినా కూడా రష్మికకు ఓ రేంజ్ లైక్స్, కామెంట్స్ వస్తుంటాయి. చిన్న పిల్లలా చేసే చేష్టలకు అందరూ ఫిదా అవుతుంటారు. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌కు నెటిజన్లు పడిపోతుంటారు. సోషల్ మీడియాలో రష్మిక ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.
ప్రస్తుతం రష్మిక సుల్తాన్ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. తమిళ, తెలుగు భాషల్లో రాబోతోన్న ఈ మూవీలో రష్మిక మందాన్న పల్లెటూరి అమ్మాయిగా నటిస్తోంది.అయితే ఈ చిత్రంలో రష్మిక పాత్రకు సంబంధించిన స్టిల్స్ ఇదివరకే బయటకు వచ్చాయి. పల్లెటూరి అమ్మాయిగా చిర, లంగాఓణిలో రష్మిక కనిపించి అందరినీ కట్టిపడేసింది. అయితే తాజాగా రష్మికకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. సుల్తాన్ సినిమా షూటింగ్‌లో భాగంగా రష్మిక పొలం పనులు చేయాల్సి వచ్చింది.

Rashmika mandanna about Sultan and cultivating
Rashmika Mandanna : పొలం దున్నుతున్న రష్మిక మందాన్న..
పొలంలోకి దిగి దున్నడం ప్రారంభించిన రష్మిక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. ఇక దీనిపై రష్మిక చేసిన కామెంట్లు కూడా వైరల్ అవుతున్నాయి. పొలం పనులు చేయడం, ఆ పాత్రను పోషించడం ఎంతగానో ఎంజాయ్ చేశాను అని చెప్పుకొచ్చింది. ఆ పాటలోని లిరిక్స్ ఆ సమయంలో సరిగ్గా నా ఫీలింగ్‌ను చెప్పేశాయంటూ రష్మిక తెలిపింది. మొత్తానికి సుల్తాన్ సినిమాతో కోలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది.
View this post on Instagram