Rashmika Mandanna : ఈ మధ్య కాలం లో ప్రేక్షకులు అసహ్యించుకున్న హీరోయిన్ లు వీళ్ళే .. రష్మికా మందన్న టాప్ లో ఉంది..!
Rashmika Mandanna : కొన్ని సినిమాలలో హీరోయిన్స్ పాత్రను చూసినప్పుడు వావ్ చాలా బాగా రాశారు, హీరోయిన్ కూడా బాగా నటించింది అనిపిస్తుంది. అలాంటి పాత్రలు ఇంకా కొన్నాళ్లకు మనకు గుర్తు ఉంటాయి. ఉదాహరణకు బొమ్మరిల్లు సినిమాలో హాసిని పాత్రz ఫిదా సినిమాలో భానుమతి పాత్ర. అదే మరి కొన్ని సినిమాలలో అయితే హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే ఓవర్గా అనిపిస్తుంటుంది. ఆ పాత్రలకు ప్రేక్షకులు అస్సలు కనెక్ట్ అవ్వలేరు. మరి తప్పు ఇది రాసిన రచయితలదా లేక నటించిన ఆర్టిస్టులదా అని విషయం పక్కన పెడితే ఇలాంటి పాత్రల వలన కొన్నిసార్లు సినిమా రిజల్ట్ మారిపోతుంది. అవి ఏ పాత్రలో ఇప్పుడు తెలుసుకుందాం.
భాస్కర్ దర్శకత్వం వహించిన బొమ్మరిల్లు సినిమాలో హాసిని పాత్ర ఎంత బాగుంటుందో ఆరెంజ్ సినిమాలో జెనీలియా పాత్ర అస్సలు బాగోదు. మరీ బ్రహ్మానందంతో వచ్చే సీన్స్ అస్సలు బాగోవు. అలాగే పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది నేషనల్ క్రష్ రష్మిక మందన. కానీ ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ అంతా ఇంట్రెస్టింగ్ గా ఉండదు. ఇక పూజ హెగ్డే అఖిల్ హీరోగా నటించిన బ్యాచిలర్ సినిమాలో చాలా డామినేటింగా ఉండడంతో పాటు కాస్త అతి ఎక్కువైనట్లు ఉంటుంది. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో రష్మిక పాత్ర అంత ఇంప్రెస్సివ్ గా ఉండదు. పూరి ఆకాష్ హీరోగా నటించిన రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది కేతికా శర్మ.
ఇందులో కేతిక శర్మ నటన అస్సలు బాగోదు. అలాగే గోపీచంద్ నటించిన పక్కా కమర్షియల్ సినిమాలో రాశి కన్నా పాత్ర అంతగా ఆకట్టుకోలేకపోయింది. అలాగే రాశి కన్నా విజయ్ దేవరకొండ తో చేసిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో కూడా రాశి పాత్ర చాలా డల్ గా ఉంటుంది. ప్రేక్షకులకు చాలా బోర్ కొట్టేసింది. ఇక పూరి జగన్నాథ్ లైగర్ సినిమాలో అనన్య పాండే పాత్ర కూడా అంతగా అనిపించదు. అసలు పూరి సినిమాల్లో హీరోయిన్ డిఫరెంట్ గా కంప్లీట్ యాటిట్యూడ్ తో ఉంటారు. అది కొన్నిసార్లు తేడా కొట్టేస్తుంది. అదే లైగర్ సినిమాలో జరిగింది. ఇక నితిన్ హీరోగా నటించిన రంగ్ దే సినిమాలో కీర్తి సురేష్ పాత్ర ఆమెకు అసలు సెట్ అవ్వలేదు. ప్రేక్షకులు కూడా ఈ పాత్రకి కనెక్ట్ అవ్వలేకపోయారు.