Rashmika Mandanna : అమ్మ బాబోయ్ అల్లు అర్జున్ , సుకుమార్ ని అడ్డంగా ఇరికించిన రష్మిక మందన్న.. పుష్ప 2 విషయంలో నరాలు తెగే బ్రేకింగ్ న్యూస్ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rashmika Mandanna : అమ్మ బాబోయ్ అల్లు అర్జున్ , సుకుమార్ ని అడ్డంగా ఇరికించిన రష్మిక మందన్న.. పుష్ప 2 విషయంలో నరాలు తెగే బ్రేకింగ్ న్యూస్ !

 Authored By prabhas | The Telugu News | Updated on :6 November 2022,8:40 pm

Rashmika Mandanna : గత సంవత్సరం డిసెంబర్ లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన పుష్ప సినిమా రికార్డ్స్ బద్దలు కొట్టింది. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటించాడు. ఫస్ట్ టైం ఫుల్ లెన్త్ మాస్ హీరోగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో పుష్ప.. పుష్ప రాజ్..తగ్గేదేలే.. అనే డైలాగ్ ఫుల్ పాపులర్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక తగ్గేదేలే డైలాగ్ జనాల నోళ్లలో బాగా నానింది. అలాగే ఈ సినిమాలో అన్ని పాటలకి ఫుల్ క్రేజ్ వచ్చింది. ఎక్కడ చూసినా పుష్ప మానియాని కనబడింది. అంతలా హిట్ అయింది పుష్ప సినిమా. అందుకే ప్రస్తుతం పుష్ప 2 సినిమా తీయడానికి సుకుమార్ సన్నాహాలు చేస్తున్నాడు.

అలాగే పుష్ప సినిమాలో హీరోయిన్ రష్మిక మందన్న నటించి ప్రేక్షకులను మెప్పించింది. మరి ముఖ్యంగా ఈ సినిమాలో బన్నీ తర్వాత అంతటి రేంజ్ తెచ్చుకున్న వ్యక్తి ఎవరు అంటే మాత్రం రష్మిక అనే చెప్పాలి. మరి ముఖ్యంగా ఈ సినిమాలో నా స్వామి రారా స్వామి అంటూ నడుము తిప్పేసి యువకుల మతులు పోగొట్టింది. ఒక్కసారిగా రష్మిక పాన్ ఇండియా స్టార్ ఎదిగింది. ఈ క్రమంలో ఆమె ఏకంగా బాలీవుడ్ లో 7 పెద్ద ప్రాజెక్టు లకు సైన్ చేసింది. అయితే రీసెంట్గా పుష్ప 2 సినిమా షూటింగ్ మొదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రష్మికకు సంబంధించిన షాకింగ్ న్యూస్ ఒకటి బయటపడింది.

Rashmika Mandanna Big news about pushpa 2 movie

Rashmika Mandanna Big news about pushpa 2 movie

పుష్ప సినిమా భారీ హిట్ అవడంతో పుష్ప 2 సినిమాకు రష్మిక మందన డబుల్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందని, ఈ క్రమంలోనే సుకుమార్ ఆమె క్యారెక్టర్ ని సగం సినిమాలో చనిపోయే విధంగా రాసుకున్నాడని ఓ న్యూస్ బయటకు వచ్చింది. అంతేకాదు ఆ ప్లేస్ లోకి బాలీవుడ్ హీరోయిన్ ని రంగంలోకి దించే విధంగా స్టోరీని మార్చుకున్నాడు. దీంతో రష్మిక కెరీర్ చిక్కుల్లో పడే అవకాశం ఉంది. పుష్ప 2 సినిమాతో మరింత పాపులారిటీ దక్కించుకునేది. ఇలా అత్యాశకు పోయి ఎక్కువ పారితోషికం అడిగితే అనవసరంగా సినిమాలో ఫుల్ లెన్త్ హీరోయిన్ గా నటించే అవకాశం కోల్పోయిందని ఫాన్స్ బాధపడుతున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది