Rashmika Mandanna : రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ వ్యవహారంపై ఆ పిక్‌తో క్లారిటీ వచ్చినట్టేనా?
Rashmika Mandanna : ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ స్టేటస్ పొందిన అందాల ముద్దుగుమ్మలు ఖాళీ లేకుండా వరుస సినిమాలతో సందడి చేస్తున్నారు. వారిలో కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఒకరు. చూపు తిప్పుకోకుండా చేసే రూపం.. మాయ చేయగల నటనతో తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న ఈ భామ.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఇక, ఇప్పుడైతే బాలీవుడ్ మూవీలను కూడా చేస్తోంది. నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకున్న రష్మిక సోషల్ మీడియాలోనూ రచ్చ చేస్తుంటుంది. ఈ అమ్మడు టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండతో ప్రేమాయణం నడుపుతుందని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘లైగర్’ చిత్రంపై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. రిలీజ్ కి ముందే ఈ చిత్రం అనేక విశేషాలతో ఆసక్తి పెంచుతోంది. పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని త్వరలో రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. పూరి స్టయిల్ లో ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ రోల్ బోల్డ్ గా ఉండబోతోంది. తాజాగా చిత్రానికి సంబంధించి పోస్టర్ విడుదల చేయగా, ఇందులో విజయ్ బట్టలు లేకుండా కనిపించారు. దీనికి రష్మిక ఆసక్తికర కామెంట్ చేసింది.

Rashmika Mandanna comments gets so many doubts about Vijay Deverakonda
Rashmika Mandanna : శుభవార్త ఎప్పుడో..
ఇది వరకు నీకు స్పూర్తి ఎవరు?అని అడిగితే.. ఎవరి పేరు చెప్పాలో అర్థమయ్యేది కాదు.. కానీ ఇప్పుడు చెబుతున్నా.. నువ్వే నాకు స్పూర్తి.. నీకు మా ప్రేమ, సపోర్ట్ ఎప్పుడూ ఉంటాయ్.. నువ్వేంటో.. ఏం చేయగలవో అందరికీ చూపించు.. నీ లా ఎవ్వరూ చేయలేరు అంటూ రష్మిక మందన పోస్ట్ వేసింది.రష్మికకి విజయ్ దేవరకొండ రిప్లయ్ ఇచ్చిన విధానం చూస్తే తప్పకుండా ఈ కపుల్ రిలేషన్ లో ఘాటు ఎఫైర్ కొనసాగిస్తున్నట్లు అర్థం అవుతోంది. విజయ్-రష్మిక జిమ్ పార్ట్నర్ అయిన సాయి కేతన్ అనే బుల్లితెర నటుడు రష్మిక, విజయ్ ల వర్కౌట్ పిక్స్ మరోసారి పోస్ట్ చేశాడు. మై బేబీస్ అంటూ ‘విరోష్’ అనే హ్యాష్ ట్యాగ్ ఇచ్చాడు.విరుష్క మాదిరిగా విరోష్ అని కలిపేసాడంటే రానున్న రోజులలో ఈ ఇద్దరు ఒక్కటి కావడం ఖాయం అని అంటున్నారు.